Sunday, September 11, 2016
Monday, September 5, 2016
Tuesday, August 30, 2016
బ్రాహ్మణ భవన్ -హైదరాబాద్ కొత్త అడ్రస్
NEW ADDRESS : (SHARE TO ALL AND COPY PASTE IN ALL GROUPS) అందరికి షేర్ చెయ్యండి... వచ్చేనెలనుండి అక్కడే అన్ని కార్యక్రమాలు...
BRAHMANA BHAVAN , BESIDE APR GARDENS, KK KUNTA , CHAMPAPET, PLOT NO. 9-3-89 , NEAR KHARMANGHAT ANJANEYA SWAMI TEMPLE, HYDERABAD MOBILE : 8686681516
BRAHMANA BHAVAN , BESIDE APR GARDENS, KK KUNTA , CHAMPAPET, PLOT NO. 9-3-89 , NEAR KHARMANGHAT ANJANEYA SWAMI TEMPLE, HYDERABAD MOBILE : 8686681516
Sunday, August 14, 2016
మాతృశ్రీ సేవ సంస్థ చేసిన విన్నపానికి దాత స్పందన
మాతృశ్రీ సేవ సంస్థ చేసిన విన్నపానికి సకాలములో స్పందించి ,దాత వెలది వెంకటేశ్వర రావు గారు పేద బ్రాహ్మణ కుటుంబానికి అందజేసిన రు,1000/ ఖరీదు చేసే నిత్యావసర వస్తువులు ఈ రోజు అనగా ది.14.08.2016,ఆదివారము ,అందించటం జరిగింది. గ్రహీతలు , దాత కు కృతజ్ఞతలు తెలిపారు. దాత వెలది వెంకటేశ్వర రావు గారు కు మాతృశ్రీ సేవ సంస్థ కృతజ్ఞతలు తెలుపుచున్నది. దానికి సంబందించిన ఫోటో .....
పవిత్ర సంగమం ఘాట్ దగ్గర నేటి విశేషాలు:(14.08.2016)
పవిత్ర సంగమం ఘాట్ , ఫెర్రీ ,ఇబ్రహింపట్నం దగ్గర ,ఆంధ్ర
ప్రదేశ్ పుష్కర ఏర్పాట్లు చక్కగా చేసారు. భక్తులను కొండపల్లి రైల్వే స్టేషన్
లగాయతు పుష్కర ఘాట్ వరకు తిరిగి వారిని అక్కడ నుండి కొండపల్లి రైల్వే స్టేషన్ కు
RTC బస్సులలో ఉచిత ప్రయాణం కలిపించారు. వైద్య సదుపాయము ,మంచి నీటి సరఫరా ,భోజన
వసతి , అలాగే స్నానమాచరించే చోట,పిండాలను కలిపే చోట,కార్ పార్కింగ్ చక్కని ఏర్పాట్లు చేసారు.
సంతోషం – కాని పిందప్రదనాలు చేసే చోట పురోహితులు కూర్చొనె
చోట ఒక పద్దతి లేకుండా పోయింది . అంత
ప్రదేశం ను చిన్న,చిన్న ,క్యాబిన్ లుగా విభజిస్తే బాగుండేది. అలాగే , మైకు లో
భక్తులకు జాగర్తలు చెప్పే తీరు ఒక హోరు లా మారి, పురోహితుడు ఏమి మంత్రం మనలను
అనమంటున్నారో ,వినిపించని పరిస్థితి !
ఇక పురోహితుల
విషయానికి వస్తే , వారికి స్తానికంగా వున్నా పోరోహిత్యం వల్ల , వారి ఖాతా దారులు
సహజముగా వారి వద్ద కే వెళతారు, కొత్త గా వచ్చే భక్తులకు ,మిగిలిన స్తానిక పురోహితులకు
,మిగతా వూళ్ళ నుండి వచ్చిన పురోహితులతాకిడితో ,
వీరి ఆదాయం కు గండి పడే పరిస్థితి ఉన్నది .
ఇక పోతే , భక్తుల
విషయం కు వస్తే , ఒక భక్తుడు తన పూర్వీకులు 32 మంది కి పేర్లకు పిండప్రదానం చేయంచి
, దాదాపు 30నిమిషాల కాలం వేచ్చిస్తే,రు.300/చేతిలో పెడితే , ఆ పురోహితుడి మొఖం
చూడా లి పాపం . అదే మంటే ,గవర్నమెంట్ మెంట్ నిర్ణయించిన ధర అంతే కదా అన్నాడు. పోనీ
, అలా గని మూసి వాయినాలు ,సంకల్ప కు ,గవర్నమెంట్ మెంట్ నిర్ణయించిన ధర ఇస్తున్నారా
అంటే అదీ లేదు.
ఇదిలావుంటే ,మరొక
అయ్యగారి విషయం – పిండప్రదానాలను , స్టీల్ పల్లెము లో చేయించి , అదే ప్లేట్ ను
మిగత వారికి వాడుతున్నంట్లుగా సమాచారం .
ఇది సంగతి.Thursday, August 11, 2016
వేద విద్యార్ధి కి ఆర్ధిక సాయము
ఈ రోజు అనగా ది.11.08.2016, గురువారము, వేద విద్యార్ధి లక్ష్మన శాస్త్రి (మచిలీపట్నం) కి అతని వేద్యాభ్యసము కొరకు ఆర్ధిక సాయముగా ,ఆగస్టు నెలకు గాను, రు. 1000/(వెయ్యి రూపాయలు మాత్రమే) ను దాత శ్రీ వెలది వెంకటేశ్వర రావు ,కొండపల్లి వారు మాతృశ్రీ సేవ సంస్థ ద్వారా అందించారు.
Monday, August 1, 2016
ప్రోగ్రెస్ రిపోర్ట్ - జూలై 2016
ప్రోగ్రెస్ రిపోర్ట్ - జూలై 2016
1. 42 మంది సభ్యులు గల
whatapp group లో కేవలం 6 గురుమాత్రమే on line survey
పాల్గొన్నారు. వారిలో దాదాపు అందరు పేద బ్రాహ్మణ కుటుంబాలను గుర్తించటానికి
కమిటి
ఏర్పాటు కావలనే తెలిపారు. కమిటి లో సబ్యులుగా ఉండటానికి ,దాని Guidelines
రూపోందించటానికి, మీలో ఆసక్తి కలవారు ఈ గ్రూప్ లో పేర్లు తెలిపితే , 03.07.2016
ఆదివారము , ఈ పని చేద్దాము. ఎవరు ముందుకు రాకపోతే , నేనే కమిటి సబ్యులను nominate
చేసుకొని పని ప్రారంభిస్తాను అని తెలపటం జరిగింది. ఎవరు ముందుకు రాని కారణంగా నేనే
కమిటి సబ్యులను nominate చేయటం జరిగింది.
2. రమేష్ కార్దియటిక్ హాస్పిటల్ లో ఒక బ్రాహ్మణడుకు
whatsapp group ద్వారా రక్త దానం గురుంచి సాయము అడిగినప్పుడు, అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న మన గ్రూప్(MATRUSRI) సబ్యుడు తన వంతు సాయముగ ప్రతి రోజు వారిని ప్రత్యేకంగా శ్రద్ధ చూపి వారు సత్వరమే కోలుకోవటం లో సహాయం చేసిన శ్రావణ్ (వైదేహి టీచర్ గారి అబ్బాయి) కి మాతృశ్రీ సేవ సంస్థ తరుపున కృతజ్ఞతలు..
3. ది.03.7.2016(ఆదివారము ) ఉదయం చక్రపాణి గారి ఇంట్లో, నేను,చక్రపాణి,భాస్కర శర్మ కలిసి నిత్యావసర వస్తువుల ఉచిత పంపిణి ఫై ఒకనిర్ణయం తీసికున్నాము.
దాని తీర్మానం ప్రకారం.:నెలకు Rs.9000/ లోపు ఆదాయం కలిగిన వారిని పేదలు గా గుర్తించాలి.. కుటుంబ సభ్యుల ఆదాయం మొత్తం Rs.9000/ లోపు గ ఉండాలి.ఎంపిక లాటరి పద్ధతి సేవా సంస్థ సబ్యులుగా Rs.100/ వార్షిక చందా గా తీసుకోవాలి.ఈ విషయాలు10.07.2016 న జరిగే మీటింగ్ లో తెలపాలి. ది.10.007.2016, ఆదివారము సాయత్రం 5 గం // కు మాతృశ్రీ సేవ సంస్థ నెలవారీ మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ పధకాలను శ్రీ SVSS Prasad వివరించి ,వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే, మాతృశ్రీ సేవ సంస్థ వార్షిక చందా రు. 100/ (వంద రూపాయిలు మాత్రమే) చెల్లించి సబ్యులుగా చేరాలని కోరారు.

4. ది.09.07.2016, శనివారము, వేద విద్యార్ధి లక్ష్మన శాస్త్రి (మచిలీపట్నం) కి అతని వేద్యాభ్యసము కొరకు ఆర్ధిక సాయముగా ,జూలై నెలకు గాను, రు. 1000/(వెయ్యి రూపాయలు మాత్రమే) ను దాత శ్రీ వెలది వెంకటేశ్వర రావు ,కొండపల్లి వారు మాతృశ్రీ సేవ సంస్థ ద్వారా అందించారు.
5.15.07.2016 మాతృశ్రీ బ్రాహ్మణ, ఆధ్యత్మిక,
సామజిక సేవ సంస్థ 3 వసంతాలు పూర్తి చేసుకొని, 4 వ వసంతం లోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా సభ్యులు ,దాతలు ,శ్రేయోభిలాషిలకు , కృతజ్ఞతలు. ఇదే సహాయ ,సహకారములను ,ఈ
సేవా సంస్థ కు ఇకముందు కూడా అందజేసి, మరిన్ని మంచి కార్యక్రమములు చేసేలా ప్రోస్వహించాలని, మీరందరూ ,ఆయా కార్యక్రమములలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను
6. మాతృశ్రీ బ్రాహ్మణ, ఆధ్యత్మిక,
సామజిక సేవ సంస్థ 3 వసంతాలు పూర్తి చేసుకొని, 4 వ వసంతం
కి అడుగెడుతున్న శుభ సందర్భంగా , పెరుగుతున్న ధరవరలు లను తట్టుకోనేల , తన వంతు సాయం గా ,మాతృశ్రీ సేవ సంస్థ, సుమారు రు.1000/విలువ గల నిత్యావసర వస్తువలను, ఈ నెల నుండి ప్రతి నెల ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్న మన సోదర బ్రాహ్మణ కుటుంబాలకు మాతృశ్రీ కానుక గా అందించటం జరుగుతున్నది . ఈ నెల శ్రీ S.V.S.S .Prasad
,Correspondent ,Talent High School ,గారి
చేతుల మీదుగా ఒక పేద బ్రాహ్మణ కుటుంబనకు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమునకు తన వంతు చేయూత గా శ్రీ వ్యాకరణం చక్రపాణి , గ్రహీత కు నూతన వస్త్రాలను కూడా బహుకరించారు.
7. కీ.శే. కనకదండిల శివరామకృష్ణ శర్మగారి జ్ఞాపకార్థం వారి కుమారుడు Dr.కృష్ణ మోహన్,(U.S.A),గారు,వేద విద్యార్థులైన శ్రీ తేజ, లక్ష్మణ శాస్త్రి లకు, జూలై 2016 మాసమునకు చెరి Rs.1000/వారి వేద విద్యాభ్యాసముకు కొరకు ఈ రోజు ఇచ్చినారు. అలాగే, సాయి అనే పాలిటెక్నిక్ చదివే విద్యార్థికి కూడా , అతని విద్యాభ్యాసము నిమిత్తము జూలై 2016 మాసము నకు Rs.2000/ ఇచ్చినారు. మాతృశ్రీ సేవ సంస్థ ద్వారా ఈ సాయము అందేందుకు సహాయపడిన భాగవతుల లక్ష్మిప్రభాకర
శాస్త్రి గారికి కృతజ్ఞతలు
8. వికలాంగులకు వీల్ చైర్ : మన స్నేహితులు
లేదా బంధువులకుటుంబాల లో, ఎవరైనా , వికలాంగులు ఉంటే, వారికి అవసరమగు Wheel Chair(Foldable)(దాదాపుగా కొత్తది), ఉచితముగా అందజేయటానికి ఒక దాత ముందుకొచ్చారు. దయచేసి , గ్రూప్ సభ్యులందరూ , ఈ విషయాన్ని గ్రహించి ,అవసరమగు వారికి ఈ విషయమును అందజేయవలసినదిగా ,కోరటం జరిగింది.
9. వికలాంగులకు వీల్ చైర్ : ఈ పేరిట ఇచ్చిన SMS కు స్పందించిన మన గ్రూప్ సభ్యుడు సాయి - దాని అవసరము ఉన్న వారి పేరు ఈ గ్రూప్ లో పెట్టటం ,నేనే వారికి ఫోన్ చేసి విషయమము చెప్పి , దాత పేరు అడ్రస్ చెప్పితే,
నిన్న సాయత్రం (30.07.2016) న వెళ్లి ఆ వీల్ చైర్ ను ఉచితముగా పొందటం జరిగింది. దాత శ్రీ మద్దిపట్ల సూరిబాబు గారు,
సహృదయంతో, మనకు అవసరం లేని వస్తువు ,మరేవరకైనా ఉపయోగపడుతుంది అన్న సదుద్దేశంతో , ఈ సాయం అందించారు. దాత లు ఈ సేవ సంస్థ కు సమాచారంఅందించిన వెంటనే , గ్రూప్ లో ఆ సమాచారం పెట్టటం , కావలసిన వారు ఆ సాయం ను అందుకోవటం జరుగుతున్నది. అయతే , గ్రహీత లు తమకు ఈ సేవ సంస్థ ద్వారా అందించినసాయం కు కనీసం కృతజ్ఞతగా తమ భావమును తెలపటం ఎంతైనా అవసరమని భావిస్తున్నాను ! ఇది సేవ చేసేవారికి కొంచెం encouragement గా వుంటుంది . ఈ
సాయం అందించటం లో వ్యాకరణం చక్రపాణి గారు తమ వంతు సాయం అందించారు. సబ్యులు కూడా ,దాత లకు encouragement గా కామెంట్స్ పెడితే బాగుంటుదని నా అభిప్రాయం .
10. రాష్ట్రీయ
బ్రాహ్మణ సంఘటన్ వారు గతం లో మైలవరం లో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ వారి పధకాల
ఫై అవగాహనా సదస్సు ను ఏర్పాటు చేసారు. 31.07.2016,ఆదివారము ,తిరువూరు లో జిల్లా
స్థాయి మీటింగ్ కు హాజరు కమ్మని ,ఇబ్రహింపట్నం మండలం నుండి ఇద్దరకు సెక్రెటరీ
మరియు కోశాధికారి పోస్ట్ లు కూడా ఇస్తామని మైలవరం నుండి కబురు పంపారు. కాని ,ఎవరు
ఆ సమావేశము కు వెళ్ళినట్లుగా సమాచారం లేదు.
వేదం గోప్పదా ????అదిఏలా
(సేకరణ :మాతృశ్రీ Whatsapp group నుండి- మహేంద్రవాడ శ్రీనివాస శర్మ గారి పంపిన పోస్ట్)
వేదం గోప్పదా ????అదిఏలా
అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది.
వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును. ఇది నమ్మబుద్ధి కావడం లేదా.
ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం
1. “ I” never said she stole my money – నేను ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )
2. I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )
3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)
4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )
5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)
6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)
7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)
చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.
ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.
క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు. జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో, అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు. దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.
ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో ) చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు. మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం. పేద్దల సహకారంతో ..
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!
!! ఓం నమో వేంకటేశాయ !!

Subscribe to:
Posts (Atom)