Monday, December 21, 2015

Tere Mere Beech Mein - Kamal Hassan

ఆలస్య వివాహము-కారణాలు-వివాహ సంబంధాలు

                                                      వివాహము
మగ పిల్లలకు   వివాహ ము  కావటం పెద్దగా సమస్యగా మారుతోంది. అందుకు కారణం ` ఆడపిల్లల సంఖ్య బాగా తక్కువ కా వటం ,  చదువు మరియు ఉద్యోగములో ఆడపిల్లలు  మగపిల్లలకంటే ఎక్కువగా ఉండటం,
ఆడపిల్లలు  ఆర్ధికంగా చక్కగా ఎదిగే అవకాశం రావటం, వారి సంపాదన పైన ఆధారపడే కొంత మంది తల్లిదండ్రులు వల్ల, ఇలా రకరకాలుగా సమస్యులున్నాయి. దీనర్ధం` ఆడపిల్లలు చదువుకోవటమే తప్పు అనటం లేదు. 20 లేదా 22 సం॥ వయస్సు వచ్చినా, ఆడపిల్లలుకు పెళ్ళిచేద్దామన్న ఆలోచన చాలా తక్కుమంది తల్లిదండ్రులకు వస్తున్నది.
                    కారణాలు ఏవైనా , సకాలంలో, సరియిన వయస్సు లో  వివాహం జరగటం యువతీ,యువకులకు ఎంతో మంచిది. ఇందుకు తల్లిదండ్రులూ సహకరించాలి. ఇరుపక్షాల వారు కోరికల లిస్టు, కొంచెం తగ్గించుకొంటే, ఈ సమస్యకు కొంత మేరకు పరిష్కారము దొరికినట్లు అవుతుంది.
                         సరే, ఇక 40సం॥ పైబడిన , వరుళ్ళ  పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఒక ప్రక్క వయస్సు అయిపోతోందన్న ఆందోళన, సమాజపరంగా హేళన భావం, వీరిని మరింత క్రుంగదీస్తోంది. వీరిలో వెనుక సెంటు భూమి లేక, చదువు అంతంత మాత్రముగానే( పట్టభద్రు అయినా సరే), ఉండి, సంపాదన రూ॥ 5000/ నుండి రూ॥15000/ వరకు ఉన్నవారికి, అసలు వివాహము అనే విషయం మర్చిపోవటమే మంచిది అన్నట్లుగానే తయారయ్యింది పరిస్థితి !
                  ఇలాంటి వారికి(40సం॥ పైబడిన వారికి) మనవి ` మీరు ద్వితీయ వివాహమునకు సిద్ధముగా ఉన్నా  కూడా వధువు దొరకటం లేదు, కాని, ఒకరు లేదా ఇద్దరు పిల్లలున్న వారు దొరుకుతున్నారు. వారిని వివాహమాడితే ` ఈ సమస్య కు పరిష్కారము గా కనిపిస్తోంది.
                    ఇలా చెప్పటం సులువే ` కాని, నేటి పరిస్థితిలో ఇది తప్పదు. ఏ మనిషి ఒంటరిగా జీవించలేడు. ఒంటరి తనం విపరీతంగా బాధించి, నా అనే వారు లేరన్న బాధ కృంగదీసి, ఆత్మహత్యకు పాల్పడే ఆలోచన కూడా వస్తుంది అనడానికి ప్రముఖ సినీ నటుడు సర్గీయ॥ రంగనాధ్‌ మరణమే ఉదాహరణ.
               కాబట్టి, 40సం॥ పైబడిన వర్లుల్లు, ఈ విషయమై ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.
                       మీలో 40సం॥ పైబడిన బ్రాహ్మణ వరు కొరకు నాకు తెలిసిన రెండు సంబంధాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. మీకు నచ్చితే, (kalikivayapremakumar@gmail.com)కు మీ వివరాలతో బాటు మీ సెల్‌ నెంబరు తెలిపితే, ఆ వధువు తరుపువారి ఫోన్‌ నెంబరు ఇస్తాను. ఇలా ఎందుకంటే, కాలక్షేపానికి, వధువు వైపు  వారిని విసిగించే వారిని  నివారించటానికే !
1) ఆరువేల నియెగులు (విడాకులు,13 ఏళ్ళ బాబు కలడు), శ్రీవత్సస, భీమవరపు శ్రీలక్షి, పుట్టిన తేదీ: 29.06.1976, నక్ష త్రం పుష్యమి, 2 వ పాదం, ఎత్తు : 5‘ 4‘‘ ,విద్య : ఇంటర్‌, హిందీ లో ప్రవీణ, ఉద్యోగం. ప్రయివేటు టీచర్‌, కావాల్సినది: సరితూగే సంబంధం , కాంటాక్టు : బిపిఆఱ్‌ విఠల్‌, గుంటూర్‌. ఇతర వివరము:  ఈ అమ్మాయి కి రెండు వివాహములు అయి,విఫలము అయినవి,వ్యసనపరుడైన భర్త, మరొకడు నపుంసకుడు,ఇలా విధి ఆ అమ్మాయిని ఏడిపించింది. ఈమె తండ్రి కోర్టు లో గుమాస్తా చేసి రిటైర్‌ అయినారు.(పోలియో తో కాళ్ళు సరిగా పనిచేయవు) అమ్మాయి కి ఒక అన్నయ్య ` అవివాహితుడు, చిరుద్యోగి..
2) వైదిక వెలనాడు, కూచిభట్ల కామేశ్వరి దేవి శిరీష, శ్రీవత్సస గోత్రం, ఉత్తర 2 వ పాదం, 20.12.1989,ఇంటర్‌ పాస్‌, 5‘ 4‘‘ , వితంతువు, ఇద్దరు ఆడపిల్లలు(6 సం॥ మరియు 3సం॥) , కావాల్సినది : 8సం॥ వయస్సు తేడా ఉన్నా ఫర్వాలేదు. కుటుంబాన్ని పోషించగ స్థోమత ఉంటే చాలు. వివరాలకు : కె.కామేశ్వర్రావు , ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా)

Monday, November 23, 2015

బ్రాహ్మణులు- వివాహ సంబంధాలు

ఈ క్రింది ఇచ్చిన వివాహ సంబంధాల సమాచారం. యజ్ఞోపవీతం ,మార్కాపురం వారి పత్రిక( నవంబర్ 2015) నుండి సేకరణ. వీటి మంచి, చెడులు స్వయముగా విచారించు కోగలరు.



Friday, November 13, 2015

తిరుమల ప్రయాణం

ది. 11.11.2015 న బుధవారము, నేను , నా పిల్లల్లు, తిరుమల శ్రీవారిని దర్సించుకున్నాము. ది. 10.11.2015, రాత్రి 9.40 కు గుంటూరు- తిరుపతి (ట్రైన్ నెంబర్    )లో తిరుపతి తెల్లవారుఝాము 5.౦౦ గంటలకు చేరాము. మాతో పాటు మరొక ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చారు. తిరుపతి  రైల్వే స్టేషన్ దగ్గరనుంచి ఆటో లో అలిపిరి చేరాము. మనషికి రూ. 20.00చొప్పున 6గురుం రూ. 120.00 చెల్లించాము . లగేజి కౌంటర్ లో లగేజి ఇచ్చి, నడక మొదలెట్టాము. ఉదయం 6.15  కు మొదలైన నడక  మద్న్యానం12.30 కు పూర్తి అయ్యింది .
                      దీపావళి రోజున తమిళ నాడు రాష్ట్రము నుండి ఎక్కువ మంది భక్తులు రావటం గమనించాను.  మెట్ల  దారి (నడక దారి) లో మెట్టు,మెట్టు కు కర్పూరం బిల్లు వెలిగిస్తూ కొందరు, పసుపు,కుంకుమ బొట్లు పెడుతూ కొందరు ,కొత్తస్తీల్ బిందెలో పసుపు నీళ్ళు పోసుకొని మెట్టులెక్కుతున్నవారు ఒకరు,అన్నింటికంటే - పూర్తిగా కాళ్ళు చచ్చుబడిపోయిన ఒకరు,  నడక మార్గము లో రావటం -  వీళ్ళందరిని చూస్తుంటే స్వామి వారి దర్సించు కోవటం లో ఒక్కరి ఒక్కరిది  ఒకొక్క పద్ధతి అనిపించింది .
        స్వామి ని దర్శించు కోవాలంటే , స్వామి అనుమతి ఉండాలేమో ! మాతో పాటు వచ్చిన  19 ఏళ్ల అమ్మాయకి, ఊహించనట్లుగా ఆడవారి ఇబ్బంది రావటం ! ఇది ఇలా ఉంటే- మరొకరి గురుంచి విన్నాను... అదేమంటే, వాళ్ళ అమ్మాయకి జాబు వచ్చిoదని నడక మార్గము  ద్వారా వస్తున్నారు, కొద్ది మెట్లు ఎక్కే సరికి  ఆ అమ్మాయకి విపెరీతముగా వాంతులట ! ఇంక మెట్లు ఎక్కలేక పోయారుట !
        సరే, మెట్లు ఎక్కుతూ , ఉచిత దర్సనం టోకెన్లు ఇఛు ప్రదేశం కు చేరాము. అక్కడ దారిలో ఉచిత దర్సనం టోకెన్ లు ఇచ్చేప్రదేశం లో పాలు మరియు కట్టేపొంగాలి ని  T.T.D  వారు నడక దారి భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. అవి సేవించి, టోకెన్లు తీసికొని తిరిగి మా ప్రయాణం (నడక) మొదలెట్టాము. మద్యాహన్నం
12.30 కు లగేజి సెంటర్ కు చేరి , మా సామానులు తీసుకున్నాము. అక్కడ లంచం అడిగారు.
       అక్కడనుండి రూమ్ తీసికోవటానికి వెళ్ళాము. జోరున వాన. వానలో తడుస్తూ  C.R.O(Central Reservation Office) చేరాము. అక్కడ వాళ్ళు మేరు రిపోర్ట్ చేయవలసిన టైం అయిపొయింది పక్క కౌంటర్ కెళ్ళి కరెక్ట్ చేయంచండి అన్నారు, ఆ పనిచేసి  రూమ్ అల్లోట్ చేయించు కొని , మాకు కేటాయించిన పాంచజన్యం గెస్ట్ హౌస్ కు వానలో తడుస్తూ ,కళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ చేరాము.
అక్కడ మా రూమ్ చూద్దుముకదా, అపరిశుబ్రముగా  ఉన్నది . మల్లీ వెళ్లి రిసెప్షన్ లో చెబితే అప్పడు క్లీనింగ్ స్టాఫ్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళారు. మల్లీ  ఇక్కడ లంచం అడిగారు.
ఆ గెస్ట్ హౌస్ లో కళ్యాణ కట్ట లేదుట , ఎదురుగుండా ఉన్న 5 అంతస్తుల మేడలో ఉన్నది , మేము ఉన్న కాటేజీ  3అంతస్తుల నుండి లిఫ్ట్ లో దిగి తలనీలాలు సమర్మించే కార్యక్రమము కానిచాము , అక్కడ మంగలి వారు ముగ్గురు కు  రూ . 50 / ఇవ్వండి , లేక పొతే మీ డబ్బులు తీసుకొండని ,నేను ఇచ్చిన రూ. 25.00 తిరిగి ఇచ్చేసారు. ఇక్కడ లంచమే !
 కాటేజీ కొచ్చి స్నానాలు చేసి , బయట టిఫిన్  చేసి స్వామి దర్శనము కు బయలు దేరాము, గుడికి  ఎటు వెళ్ళలో తెలియదు, జీప్ ల వాళ్ళ మాట విని 1 గంటలో దర్సనం అవుతుదని చెప్పి మాదగ్గర మనిషికి 20/ చొప్పున తెసికొని  సర్వదర్సనం వెళ్ళే దారి దగ్గర దింపాడు.
 అక్కడ నిండి నిజంగానే 1 గంటలో దర్సనయం అయ్యింది.
అన్తఃరం హుండీ లో మాకనుకలు వేసి లడ్డు అలోకోసం బయలు దేరాము. నడక మార్గం లో మాకిచిన టోకెన్ చూపి టోకెన్ కి ఓకే లడ్డు చొప్పున పొందాము. బయలు దేరే ముందు సెల్ ఫోన్ లు ఒక కుంటర్ లో ఇచ్చి టోకెన్ తెసికోవాలి , అవి  బయట వేరే కౌంటర్ దగ్గర తెసికోవాలి .
ఇవ్వన్ని అయిన తరువాత S.V.B.C channel వాళ్ళు నిర్వహించు  కార్యక్రమములు అక్కడే వున్న వేదిక ను చూసాము.
తరవాత మా కాటేజీ దగ్గర లో ఇందాక కల్యాణకట్ట దగ్గర T.T.D వారి ఉచిత అన్నదాన సత్రములో స్వామి అన్నప్రసాదము స్వీకరించి, రూమ్ ఖాళి చేసి (ఇక్కడ కౌంటర్ లో లంచం), మా దగ్గర కాషన్ డిపాజిట్ గా కట్టించు కున్న Rs,500/ లు తిరిగి తీసుకుని కొండ క్రిందకు వచ్చి అక్కడనుండి ట్రైన్  లో తిరిగి విజయవాడ, అక్కడనుండి ఆటో లో కొండపల్లి ఉదయం 5.30 కు చేరాము.
ఇలా ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న తిరుమల ప్రయాణం స్వామీ వారి దయతో సుఖం గ జరిగింది 






  https://plus.google.com/+PremakumarKalikivaya/posts/AoohQ23GMEbTirumal 1Tirumal 3

Wednesday, November 4, 2015

టాలెంట్ తో సమావేశం

డి . 03.04.2015 న టేలెంట్ స్కూల్ లో ప్రసాద్ గార్ని కలిసి మొదటి సారిగా కో-ఒపెర్తివే స్టోర్స్ గురుచి మాట్లదనను. చేద్దాము అన్నారు.
ఇటీవల శ్రీహరి పురోహితులు విజయవాడ వారిని సవం మోయటానికి మనుషులు దొరుకుతార అని అడిగాను దోరోకుతారు అన్నారు Rs. 600 to Rs.1000/ దాక ఉండవచ్చు న్ని తెలేపారు.

Monday, November 2, 2015

02.11.2015

నవంబర్ 1 న ఆదివారము కొండపల్లి లో బ్రాహ్మణ మహిలలలతో స్వయం ఉపాధి మార్గాలు, ఆదాయం పెంపుదల అంశాల ఫై చర్చ జరిగింది. చర్చ అనంతరం కో- ఒపరటివే స్టోర్స్ ను మొదలు పెట్టాలని తీర్మానించారు. 8 వ తారీకు తుది నిరయం తీసికుంటారు.

అక్టోబర్ 2015

 అక్టోబర్ 28, బుధ వారము శ్రీ ధూమాల్రావు రాజారాం పంతులు గారు అనారోగ్యం తో పరమదించారు. వీరు చాల కాలము విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో అకౌంట్స్ విభాగము లో సేవలందిచారు. గతం లో గాయత్రీ ద్విజ సమాజం లో కూడా చురుకు గా పని చేసారు. వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తించాలని బ్రాహ్మణవాణి పత్రిక కోరుకుంటున్నది.
స్వర్గీయ రాజరామ్ పంతులు గారు


Tuesday, October 27, 2015

A TELUGU STORY

సరిత - రామనాథం ,రాజ్యలక్ష్మి లకు ఒక్కగానొక్క కూతురు . చిన్నప్పటి నుంచి  చదువుల్లో ఫస్ట్ రాంక్  లో వుండేది . మధ్య తరగతి కుటుంబం కావటం వల్ల ,ఆడపిల్లను బాగా చదివించి  తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయాలనీ , తన స్తోమత కు ఎక్కువైనా ,సరిత ను చార్టెడ్ అకౌంటెంట్ చేసాడు రామనాథం గారు .సరిత  కు  చదువు అయ్యినవెంటనే , ఉద్యోగము  వచ్చింది .
     ఒక రోజు ,  తల్లి బాగా దగ్గుతూ వుంటే , ఏమిటమ్మా , ఏమి అయ్యింది అని తల్లి దగ్గరు వెళ్లి అడిగింది. తను చుస్తూ  ఉండగానే, మళ్ళీ  దగ్గుతూ తల్లి నోటినుండి రక్తం పడడం గమనించి , వెంటనే హాస్పిటల్ కు తీసికెళ్ళింది. టెస్ట్లు   అన్ని చేసాక, రేపు వస్తే విషయం చెబుతామన్నారు, మర్నాడు, రామనాథం గారు, సరిత వెళ్లి విష యం  కనుకున్ని, రామనాథం గారు కూలబడి పోయారు ,  ,రాజ్యలక్ష్మి గారి కి కాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి .ఇంక రోజులే మిగిలాయి ! కొన్ని రోజులు మృత్యువు తో     పోరాడుతూ  రాజ్యలక్ష్మి గారు కన్నుమూసారు .
 ఉద్యోగము లో చేరి కొద్ది రోజులే అవటం తో సెలవలు పెద్దగ దొరకలేదు సరితకు, దాంతో తల్లి పోయిన,  4 వ రోజే డ్యూటీ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది .
కార్యక్రమాలన్నీ అయిన తర్వాత, ఒక రోజు సడన్ గా తన బావమరిది సూర్యనారాయణ  వచ్చాడు.  కుశల ప్రశ్నలు  అయ్యాక, తనువచ్చిన పని  చెప్పడం మొదలెట్టాడు సూర్యనారాయణ    " బావా ! అక్క పోయి  ఎంతో కాలం కాలేదు! మరి నేను ఇలా మాటలాడ వచ్చో , లేదో తెలియదు . అంటూ నసుగుతున్నాడు.  రామనాథం గారు ఫరవా లేదు, చెప్పు అనటం  తో విషయం చెప్పాడు  ." ఏమి లేదు బావా ! మా అబ్బాయి సతీష్ కు సంబంధాలు చూస్తున్నాము, బయటసంబంధాల కంటే అయిన వాళ్ళలో చూద్దామని, మీ అమ్మాయి సరిత ను మా ఇంటి కోడలుగా చెసుకుందామని . అడగటానికి వచ్చాను . అన్నాడు . దీనిలో కాదనటా నికి ఏమి లేదు - సతీష్ ,సరిత్ కు అన్ని  విధాల  జోడినే , కానీ,   ఎందుకో    రాజ్యలక్ష్మి బతికున్నప్పుడు ఈ ప్రస్తావన్ వచ్చినప్పుడు  వద్దు అంది, ప్రస్తుతం , తనకు ఎవరు లేరు, పిల్ల ఎవరింటింకొ  కంటే అయిన వాళ్ళఇంటి కేలెతే  మంచిదే  కదా అనిపిస్తోది,  రామనాథం గారికి . చివరకి,  సతీష్ కిచ్చి చేయటానకి .ఒప్పుకుంటూనే  ప్రాధేయ పడుతూ  అడిగారు బావమరిదిని  "మరి నేను చేసుకోలేని  రోజు న, నా  కూతురింటికే  రావాలి వస్తుంది  , న చివరి రోజులు   అమ్మాయి దగ్గరే పోవాలి, అందుకు మీ కిస్తామేనా" అని ." ఛ ,ఛ అదేమి  మాటలు బావా ! నీ కూతురింటికి  కాక మరి ఎక్కడి కెలతావు " , అంటూ భోరోస ఇచ్చాడు  సుర్యనారాయణ. 

పెళ్ళి అయింది . కొద్దిరో జులు విడిగానే ఉన్నా  చేసుకోలేక కూతురి ఇంటికి    చేరారు  రామనాథం  గారు .
 రెండు సంవసతరాలు  గడిచేటప్పటికి తను ఇద్దరు పిల్లల కి తాత కూడా అయ్యరు. కూతురు కు భారం  కాకుండా తన కొచ్చే పెన్శ్శన్లొ  లో ఆరు వేలు ఇసున్నారు, మనవల్ల్తో చక్కగా కా లక్హేపం  జరుగుతున్నది . సుర్యనారాయణ కి ఇవేమీ నచ్చలేదు, కూతురు పెట్టే   తిండి బాగానే  వంట పట్టింది అనటం , మనవళ్ళకు అనారోగ్యం  చేస్తే అవి వాళ్ళకు తను తెచ్చే  తినుబండారలవల్లె అని సూటి పోటి మాటలనటం   జరుగుతోంది . ఇది నెమ్మదిగ అల్లుడు కుతురు  మధ్య  తగాదా ల దాక  వెళ్ళింది దాంతో ,బాగా కలత చెందిన   రామనాథంగారు, నెమ్మదిగా తన మకాం
 వృ ధా శ్రామానికి  మార్చారు . తన ఆదాయం కోసం, ఒక ఏటిమయం  దగ్గర  గార్డు గా చెరారు. 
 మన అను  కుని పిల్ల నిస్తే పరిస్తితి ఎలా తయారయిందో అని నిట్టూ ర్చటం  తప్ప ఏమి చేయలేని నిస్సాయ స్థితి  రామనాథం  గారిది  

Sunday, October 4, 2015

About Andhra Pradesh Road transport corporation.

I would like to bring to the notice of the public and at the same time to the APS RTC Authorities, about two points.

1. Gents must be punished if they sit in Ladies seats with  money chargeable (i.e with fine), if it happens second time punishment must be in a severe manner. This is not a simple thing. every woman is suffering with this problem in A.P.S.R.T.C Buses.

2. CC Cameras must be installed in the city buses and should be  monitored at the control room of R.T.C and police.

3. Swiping machines must be provided for conductors so that there will be no coin and exchange problem between passengers and conductor. and it will encourage plastic money.

Wednesday, July 1, 2015

www.andhrabrahmin.org To day in EENADU daily ANDHARA PRADESH BRHMAN SAKHEMA SAMSTHA Ltd given notification for poor brahmin pupils who passed II year inter for applying for scholarships for details see www.andhrabrahmin.org.

Tuesday, May 26, 2015

why the  APS RTC didn't try to implement easy way for ticket issuing in city and route buses. Where as the railways are implementing even platform tickets threw machines by machines, there by avoiding Q system. Public are facing so much at tendering coins at ticket issuing in buses. some times quarlsome nature also occuring between RTC Staff and public, To avoid this RTC Should implement swiping machines as like debit cards.

Thursday, March 5, 2015

Voter Aadhar seeding

Epic Aadhar Seeding procedure
Voters may directly call to the Toll free number 1950 by the mobile app, SMS, call centre for Aadhar seeding
Call 1950 and say your voter card number and Aadhar card number, thats all your voter card will be linked to Aadhar .
 You can also seed your vote card to Adhar number by the online portle by getting One time Pass word.
 or SMS SEEDPIC Epic no , Aadhar No to 08790499899    

For on line use this link     http://ceoandhra.nic.in/ 

-Source 17 Feb 2015, EENADU (Dist edition (Vijayawada)


Tuesday, March 3, 2015

ఈ మధ్య నేను హౌస్ ఈక్విటీ లోన్ S.B.I నుండి తీసుకోవటం జరిగింది . చాలా బాగుద్ది సర్వీస్ . ఒకప్పుడు State Bank of India సాఖలకీ వెళ్ళాలంటేనే భయమా వేసేది . ఇప్పుడుకి మనము వచ్చిన పని అవుతుందో అని. కానీ, ఇప్పుడు అలా లెదు.  

Monday, March 2, 2015

ఇటీవల నేను ఒక వివాహానికి హాజరయ్యాను, అక్కడ పెళ్ళికొడుకు తాళి కడుతునప్పడు గని, జీలకర్రా బెల్లం పెడున్నపుడు గని చుట్టూ చేరిన పిలవరు" ఓ" అంటూ పెద్దగ అరవటం ,పెళ్లి కి వచ్చిన వారిని పెళ్లి చూడనివ్వకుండా గుంపుగా చేరటం నాకు ఎందుకో నచ్చలేదు, వీడియో ల పిచ్చ్చి లో కొన్ని సున్నుతఃమైన భావాలూ,విషయాలు కనుమరుగు అవుతున్నాయి అనిపిస్తోంది  
నాకు ఈ బ్లాగ్ వ్రాయటం కొత్త. ఈ  రోజే మొదలు పెడుతునాన్ను . దయచేసి ప్రోత్శాహించండి