Monday, December 21, 2015

Tere Mere Beech Mein - Kamal Hassan

ఆలస్య వివాహము-కారణాలు-వివాహ సంబంధాలు

                                                      వివాహము
మగ పిల్లలకు   వివాహ ము  కావటం పెద్దగా సమస్యగా మారుతోంది. అందుకు కారణం ` ఆడపిల్లల సంఖ్య బాగా తక్కువ కా వటం ,  చదువు మరియు ఉద్యోగములో ఆడపిల్లలు  మగపిల్లలకంటే ఎక్కువగా ఉండటం,
ఆడపిల్లలు  ఆర్ధికంగా చక్కగా ఎదిగే అవకాశం రావటం, వారి సంపాదన పైన ఆధారపడే కొంత మంది తల్లిదండ్రులు వల్ల, ఇలా రకరకాలుగా సమస్యులున్నాయి. దీనర్ధం` ఆడపిల్లలు చదువుకోవటమే తప్పు అనటం లేదు. 20 లేదా 22 సం॥ వయస్సు వచ్చినా, ఆడపిల్లలుకు పెళ్ళిచేద్దామన్న ఆలోచన చాలా తక్కుమంది తల్లిదండ్రులకు వస్తున్నది.
                    కారణాలు ఏవైనా , సకాలంలో, సరియిన వయస్సు లో  వివాహం జరగటం యువతీ,యువకులకు ఎంతో మంచిది. ఇందుకు తల్లిదండ్రులూ సహకరించాలి. ఇరుపక్షాల వారు కోరికల లిస్టు, కొంచెం తగ్గించుకొంటే, ఈ సమస్యకు కొంత మేరకు పరిష్కారము దొరికినట్లు అవుతుంది.
                         సరే, ఇక 40సం॥ పైబడిన , వరుళ్ళ  పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఒక ప్రక్క వయస్సు అయిపోతోందన్న ఆందోళన, సమాజపరంగా హేళన భావం, వీరిని మరింత క్రుంగదీస్తోంది. వీరిలో వెనుక సెంటు భూమి లేక, చదువు అంతంత మాత్రముగానే( పట్టభద్రు అయినా సరే), ఉండి, సంపాదన రూ॥ 5000/ నుండి రూ॥15000/ వరకు ఉన్నవారికి, అసలు వివాహము అనే విషయం మర్చిపోవటమే మంచిది అన్నట్లుగానే తయారయ్యింది పరిస్థితి !
                  ఇలాంటి వారికి(40సం॥ పైబడిన వారికి) మనవి ` మీరు ద్వితీయ వివాహమునకు సిద్ధముగా ఉన్నా  కూడా వధువు దొరకటం లేదు, కాని, ఒకరు లేదా ఇద్దరు పిల్లలున్న వారు దొరుకుతున్నారు. వారిని వివాహమాడితే ` ఈ సమస్య కు పరిష్కారము గా కనిపిస్తోంది.
                    ఇలా చెప్పటం సులువే ` కాని, నేటి పరిస్థితిలో ఇది తప్పదు. ఏ మనిషి ఒంటరిగా జీవించలేడు. ఒంటరి తనం విపరీతంగా బాధించి, నా అనే వారు లేరన్న బాధ కృంగదీసి, ఆత్మహత్యకు పాల్పడే ఆలోచన కూడా వస్తుంది అనడానికి ప్రముఖ సినీ నటుడు సర్గీయ॥ రంగనాధ్‌ మరణమే ఉదాహరణ.
               కాబట్టి, 40సం॥ పైబడిన వర్లుల్లు, ఈ విషయమై ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.
                       మీలో 40సం॥ పైబడిన బ్రాహ్మణ వరు కొరకు నాకు తెలిసిన రెండు సంబంధాలు ఇక్కడ ప్రస్తావిస్తాను. మీకు నచ్చితే, (kalikivayapremakumar@gmail.com)కు మీ వివరాలతో బాటు మీ సెల్‌ నెంబరు తెలిపితే, ఆ వధువు తరుపువారి ఫోన్‌ నెంబరు ఇస్తాను. ఇలా ఎందుకంటే, కాలక్షేపానికి, వధువు వైపు  వారిని విసిగించే వారిని  నివారించటానికే !
1) ఆరువేల నియెగులు (విడాకులు,13 ఏళ్ళ బాబు కలడు), శ్రీవత్సస, భీమవరపు శ్రీలక్షి, పుట్టిన తేదీ: 29.06.1976, నక్ష త్రం పుష్యమి, 2 వ పాదం, ఎత్తు : 5‘ 4‘‘ ,విద్య : ఇంటర్‌, హిందీ లో ప్రవీణ, ఉద్యోగం. ప్రయివేటు టీచర్‌, కావాల్సినది: సరితూగే సంబంధం , కాంటాక్టు : బిపిఆఱ్‌ విఠల్‌, గుంటూర్‌. ఇతర వివరము:  ఈ అమ్మాయి కి రెండు వివాహములు అయి,విఫలము అయినవి,వ్యసనపరుడైన భర్త, మరొకడు నపుంసకుడు,ఇలా విధి ఆ అమ్మాయిని ఏడిపించింది. ఈమె తండ్రి కోర్టు లో గుమాస్తా చేసి రిటైర్‌ అయినారు.(పోలియో తో కాళ్ళు సరిగా పనిచేయవు) అమ్మాయి కి ఒక అన్నయ్య ` అవివాహితుడు, చిరుద్యోగి..
2) వైదిక వెలనాడు, కూచిభట్ల కామేశ్వరి దేవి శిరీష, శ్రీవత్సస గోత్రం, ఉత్తర 2 వ పాదం, 20.12.1989,ఇంటర్‌ పాస్‌, 5‘ 4‘‘ , వితంతువు, ఇద్దరు ఆడపిల్లలు(6 సం॥ మరియు 3సం॥) , కావాల్సినది : 8సం॥ వయస్సు తేడా ఉన్నా ఫర్వాలేదు. కుటుంబాన్ని పోషించగ స్థోమత ఉంటే చాలు. వివరాలకు : కె.కామేశ్వర్రావు , ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా)