Thursday, January 26, 2017

bhagavanthudu

[8:36 AM, 1/26/2017] +91 72072 53159: భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం.


మౌనం -

              దైవభాష.

              సనాతనం.

              లిపి లేని విశ్వభాష.

              ధార్మిక దివ్యత్వానికి ద్వారం.

              సనాతన భాషాస్రవంతి.

మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు, నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు, మౌనమంటే అంతరింద్రియ (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణమునే అంతరింద్రియమంటారు) విజ్రుంభణను ఆపడం. మౌనమంటే ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోషములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం.


మౌనమంటే -

                   నిరంతర భాషణ.

                   చింత, చింతన లేని తపస్సు.

                   అఖండ ఆనందపు ఆత్మస్థితి.

                   విషయ శూన్యావస్థ.

యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః అన్నారు శ్రీ శంకరులు. మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది.

పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదుశాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహంవృత్తి ఏమాత్రం  ఉదయించనట్టి స్థితినే మౌనమంటారు. ఈ మౌనం మూడు రకాలు.

1. వాజ్మౌనం :-


 వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన పరుషవచనాలు పలుకుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.



2. అక్షమౌనం :-

               

కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక యేకాగ్రనిష్టలో నుండుట. ఈ మౌనం వలన ఇంద్రియాలు నియంత్రణ ద్వారా ధ్యానవైరాగ్యాలు బాగా అలవడుతాయి.



3. కాష్ఠమౌనం :-

      దీనిని మానసిక మౌనమంటారు. మౌనధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనమంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది.


దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా వున్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.


మౌనం -

                     దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.

                      గురువు మౌనం జ్ఞానానుగ్రహం.

                      జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.

                      భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.

ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు, మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది, అంతర్యామిని దర్శింపజేస్తుంది, మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది.

మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధసంభాషణ అని శ్రీ రమణులు అంటారు. మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్చలద్వారా, చర్యలద్వారా దేనిని తెలుసుకోలేరో, దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు వుంటాయి, కానీ; మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞానస్రవంతి.

మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనలేయని మహాత్ములు పేర్కొంటారు.

పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం

బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే

తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని

ర్మలమగు మౌనము మారుతనందన! మానక దీవి భజింపదగున్.

                                          - శ్రీ సీతారామాంజనేయ సంవాదం.

ఓ వాయుపుత్రా! అవాజ్మనసగోచరమైన బ్రహ్మమే స్వస్వరూపభూతమైనదని నిశ్చయించి, యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే వుండవు. ఇట్టిస్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం.


'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం' వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం, ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.                        
[9:18 AM, 1/26/2017] +91 72072 53159: ఇబ్రహింపట్నం మండల బ్రాహ్మణ సేవా సమాజము: ఈ నెల కార్యక్రమము: ఈ కార్యవర్గము 10.11.2016 నుండి అమలులోకి వచ్చినది మొదలు , నవంబర్ లో మైలవరం,  రాష్టీయ బ్రాహ్మణ సంఘటన వారు,మైలవరం లో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమము లో మన సబ్యులు పాల్గొనేలా ఏర్పాటు చేసింది. డిసెంబర్ లో మన సంస్కృతి,సంప్రదాయములో భాగంగా “ బ్రాహ్మణ మహిళలకు ముగ్గుల పోటీలు” నిర్వహించింది. ఈ నెల 29.01.2017(ఆదివారము), టాలెంట్ హైస్కూల్(అమెరికన్ హాస్పిటల్ వెనుక,లలిత పరమేశ్వరి  గుడి వద్ద ),కొండపల్లి లో ఉదయం పూట,గోపూజా కార్యక్రమము జరుగును.(సమయము , మరియు కార్యక్రమము వివరము, కొద్ది సేపటిలో ప్రకటిస్తాము).ఈ కార్యక్రమములో బ్రాహ్మనేతరులు కూడా అవకాసము కలిపిస్తున్నాము. కావున, సబ్యులందరూ , ఈ కార్యక్రమములో పాల్గొన వలిసినదిగా కోరుచున్నాము.                                              
[12:52 PM, 1/26/2017] Somayajulu Panchaya: 🇮🇳🇮🇳🇮🇳 ఏపీ పంచాయతి రాజ్ enc కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు  🇮🇳🇮🇳🇮🇳
సోమయాజులు

somany waht app telegram

💐బ్రాహ్మణులంతా ఒకే వేదికకు🙏

🙏మహోన్నత బ్రాహ్మణ ఐక్యతా యజ్ఞము లోకి ఆహ్వానం💐
🙏 మంచి ఉద్దేశ్యం తో  బ్రాహ్మణులకు (మనకోసం మనం) ఎంతో కొంత పరస్పర సహాయ సహకారాలు పొందుటకు,, సంఘటితం చేద్దామని  వేలాది మంది బ్రాహ్మణులతో ఏర్పాటు చేయబడుతున్న telegram సూపర్(భారీ)గ్రూప్స్.
ఈ గ్రూప్స్ లో జాయిన్ అయితే మీరు వేరే గ్రూప్ లలోని ముఖ్యమైన సమాచారం మొత్తం ఈ గ్రూప్స్ లొనే పొందే అవకాశం ఉంది. పాత మెసేజ్ లు కూడా చూసే అవకాశం. ఏ గ్రూప్ ఏ విషయానికి సంబంధమో అవే విషయాలు మాత్రమే పోస్ట్ చేయాలి. పరుల సమయాన్ని వృధా చేసే అనవసర మెసేజ్ లు పోస్ట్ చేయరాదు.
👇 లింక్స్ కోసం....
దిగువ ఎవరికి ఏ కేటగిరీ అవసరమో, ఏ కేటగిరీలోకి వస్తారో ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ గ్రూప్స్ లో చేరగల్గుటకు లింక్స్ పోస్ట్ చేస్తున్నాము.🙏

దయచేసి సభ్యులు telegram app ని మీ ఫోన్ నందు ఇంస్టాల్ చేసుకోగలరు, మీకు తెలిసిన బ్రాహ్మణ బంధు,మిత్రులకు తెలియచేయండి.
టెలిగ్రాం app కొరకు:👇
https://play.google.com/store/apps/details?id=org.telegram.messenger

తరువాత దిగువ గ్రూప్స్ లో జాయిన్ అగుటకు లింక్స్👇👇👇👇
1.బ్రాహ్మణ వివాహ సంబందాలు
https://t.me/joinchat/AAAAAECbzF0eQoNfGT-O4Q

2.బ్రాహ్మణ విద్యార్థులు
https://t.me/joinchat/AAAAAECg5foS0mCjJKewcA

3.బ్రాహ్మణ ఉద్యోగార్థులు
https://t.me/joinchat/AAAAAD9q_O-7eRtW74Ps2A

4.బ్రాహ్మణ ప్రభుత్వ ఉద్యోగులు
https://t.me/joinchat/AAAAAD_OmlpUJ1ObSv_CSA

5.బ్రాహ్మణ ప్రైవేట్ ఉద్యోగులు
https://t.me/joinchat/AAAAAD64M-Bc4sxd0C4Rcg

6.బ్రాహ్మణ వ్యాపారులు
https://t.me/joinchat/AAAAAD_EqqsHh5DesWEkSw

7.వేద/స్మార్త/అర్చక/వాస్తు/జోతిష్కులు (పురోహితులు)
https://t.me/joinchat/AAAAAEFuxbZ0z1zT8g_Eqg

8.బ్రాహ్మణులు-ప్రభుత్వ సహాయం కోరువారు
https://t.me/joinchat/AAAAAEAUsa_4jCXnYOehsg

9.బ్రాహ్మణులు-స్వగృహం కోరువారు
https://t.me/joinchat/AAAAAD_px8NAvGrqDcL1xw

10.బ్రాహ్మణ న్యాయవాదులు
https://t.me/joinchat/AAAAAEEM-4CxazZ8kYYlqQ

11.బ్రాహ్మణ జర్నలిస్టులు
https://t.me/joinchat/AAAAAEF9cug5jFiQ42uuGA

12.బ్రాహ్మణ డాక్టర్లు
https://t.me/joinchat/AAAAAEBjEsJ9BWIBnT2gmQ

13.బ్రాహ్మణ రక్త దానం
https://t.me/joinchat/AAAAAD6sHSvog5_ys_Pfew

14.బ్రాహ్మణ మహిళ
https://t.me/joinchat/AAAAAEARFYcKG6urEruuNw

15.బ్రాహ్మణులు-రాజకీయం
https://t.me/joinchat/AAAAAEA-TF-p5XlfZp8tjA


నానావిధమైన విషయాలకు👇
16.Brahmin's for BRAHMIN'S
https://t.me/joinchat/AAAAAD_dfVD1TRXORLF3gg

పై 16 విషయాలలో  ఎవరికి ఏ గ్రూప్ అవసరమో ఆ గ్రూప్ లింక్ ద్వారా ఆ గ్రూప్ లో చేరగలరు.
కొత్త గ్రూప్స్ కావున   అందరూ అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది.
🙏 సంయమనం, సహనం వహిస్తారని కోరుకుంటున్నాము.💐

అత్యధికంగా గ్రూప్స్ లోకి బ్రాహ్మణ సభ్యులను మాత్రమే చేర్చి సహకరించగలరు.
.....................
శ్రీ చెరువు.శివప్రసాద్
దక్షిణభారత్ సమన్వయకర్త

శ్రీ చింతా. గోపి శర్మ
A.P.అధ్యక్షులు

శ్రీ ముదిగొండ.గోపికృష్ణ
తెలంగాణ అధ్యక్షులు


🙏నాగదేవర.లక్ష్మీ నారాయణ శర్మ,
IBP,AP, PRINCIPLE SECRETARY,
అంతర్జాతీయ బ్రాహ్మణ సంసద్

http://brahmin.world
INTERNATIONAL BRAHMIN PARLIAMENT,
ప్రపంచ వ్యాప్తంగా 75000 మంది బ్రాహ్మణ సభ్యులు కల్గిన  అతిపెద్ద బ్రాహ్మణ organisation.⁠⁠⁠⁠

jobs

Hi All,

With all your support we are almost providing guidance on CAREERS & JOB ASSISTANCE as per below context almost free of service.

1)Reaching thousands of Job aspirants via 45 plus Whatsapp groups, Via 300 plus by mails n dashboards etc

2)Posting all referral opportunities weekly or bi weekly on pratapsdigital.wordpress.com

3)We are guiding on Resume making, Cover letters, Interview Tips n Tricks etc.

4)Sharing Knowledge
/Domain related documents wherever required as per industry trendz.

5)Clarifying doubts on calls.via mails n chats wherever required etc.

Although we are not assuring any job but we are trying to our best to bring in the best.

Thanks a lot for your support.

Looking forward
PRATAP MALLADI

Monday, January 16, 2017

story

రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే...!!

ఒక ఊరిలో నారాయణ అనే పండితుడు ఉండేవాడు. ప్రజలకు పురాణ ప్రవచనాలు చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. సదాచార సంపన్నుడిగా, నిష్టాగరిష్టుడిగా అందరి మన్ననలూ పొందినవాడు."అతడు పిలిస్తే దేవుడు పలుకుతాడు" అని ఊరంతా చెప్పుకుంటారు. నారాయణ కూడా అంతటి భక్తిశ్రద్ధలు దేవునిపట్ల కనబరిచేవాడు. నిరంతరం దైవనామస్మరణతో తనేంటో తన పూజాపునస్కారాలేంటో అన్నట్టు ఉండేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడుకాదు. తనకు కష్టమొచ్చినా, సుఖమొచ్చినా దేవుడితోనే చెప్పుకునేవాడు. మొత్తానికీ ఊరందరిదీ ఒకదారి ఉలిపిరి కట్టది ఒకదారి అన్నట్టు బ్రతకసాగాడు.

ఒకనాటి ఉదయం ఆ ఊరి కరణం నారాయణ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఆ రోజు మౌనవ్రతంలో ఉన్న నారాయణ తలుపు తీసి ఏమిటి అన్నట్టు చూసాడు."స్వామీ వాతావరణం బాగాలేదు. గాలివాన వచ్చేలా ఉంది. ఊరికి వరద ముప్పు ఉందని భయపడుతున్నాం. కనుక, తమరు త్వరగా కాసిని సామాను సర్దుకుని సురక్షిత స్థలానికి బైలుదేరండి" అని ఆందోళనగా చెప్పాడు కరణం. నారాయణ ఆ మాటలకు చీమకుట్టినట్టు కూడా చలించలేదు. గోడకు ఉన్న దేవుడి పటాన్ని చుపిస్తూ "అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భయంలేదు" అన్నాట్టు సైగచేశాడు. కరణానికి ఏమీ అర్ధం కాక, బుర్రగోక్కుని త్వరగా తెమలండి" అనేసి, మిగతావారిని హెచ్చరించడానికి వెళ్ళిపోయాడు.

అతడెళ్ళిన కాసేపటికి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. చూస్తుండగానే కుంభవృష్ఠిగా మారింది. చెరువులూ, వాగులూ నిండసాగాయి. ఊరిజనం ఎడ్లబళ్ళు కట్టుకుని గుంపులు గుంపులుగా ఊరు వదలి తరలిపోసాగారు. ఒక బండి నారాయణ ఇంటి ముందు ఆగింది- "నారాయణ స్వామీ! వానపెద్దదైంది. చెరువు కట్టకి గండి పడేలాఉంది. త్వరగా రండి పోదాం" అని అరిచాడో గ్రామస్థుడు. పూజలో నిమగ్నమైన నారాయణ సమాధానం కూడా చెప్పకుండా దేవుడి పటం వైపు ఓ సారి చూసి, తిరిగి పూజలో నిమగ్నమయ్యాడు. ఎడ్లబండి మీద ఉన్న జనం మరికొంతసేపు నారాయణ కోసం కేకలు వేసి, వరదనీటీ ఉదృతి పెరగడంతో కదిలి వెళ్ళిపోయారు.

ఊరంతా ఖాళీ అవుతుంది. ఊరిబైట చెరువుకు భయపడ్డట్టుగానే గండి పడింది. నీరు ఒక్కసారిగా ఊళ్ళోకి ప్రవేశించి ఇళ్ళను ముంచెత్తసాగింది. నారాయణను ఇంట్లోకి కూడా నీరు ప్రవేశించి క్రమక్రమంగా పెరగసాగింది. అతడు దేవుడి పటం చేతపట్టుకుని రెండో అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ నిలబడి భగవధ్యానం చేయసాగాడు అక్కడక్కడా చిక్కుకున్ని ఉన్న జనాన్ని, వీలైతే పశువుల్ని పడవల్లోకి ఎక్కించి తరలించసాగారు ఊరిపెద్దలు. ఒకపడవ నారాయణ ఇంటి ముందుగా పోతుంది. వాళ్ళు నారాయణను చూసి, "స్వామీ! రండి పడవలో తీసుకుపోతాం" అని కేకలు వేశారు. దేవుడి మీద అపారమైన నమ్మకం ఉన్న నారాయణ అప్పటికీ చెలించలేదు. చేతిలో ఉన్న దేవుడి పటాన్ని వారికి చూపిస్తూ "నాకేం భయం లేదు" అన్నట్టూ సైగ చేశాడు. వారికి అతడేమంటున్నాడో అర్ధం కాలేదు. పడవ వెళ్ళిపోయింది. వరద పోటేత్తింది. ఊరు మునిగి పోయింది. రెండో అంతస్తులోకి కూడా చొచ్చుకు వచ్చిన నీరు నారాయణను లాక్కెళ్ళింది. వరద నీటిలో కొట్టుకుపోతూ అతడు ఊపిరాడక మరణించాడు.

అలా చనిపోయిన నారాయణను దేవదూతలు పట్టుకుపోయి, భగవంతుడి సభలో ప్రవేశపెట్టారు. నారాయణకు తాను చనిపోయిన సంగతి అర్ధమైంది. తీవ్రమైన దుఃఖంతో పాటూ దేవునిపై అమితమైన ఆగ్రహం కలిగింది. దూతలు అతడ్ని దేవుడి ముందు నిలబెట్టగానే తన అక్కసునంతా వెళ్ళగ్రక్కుతూ, " దేవుడా! నీవే దిక్కని నమ్మానే? ఆపద్భాంధవుడవని కీర్తించానే? కానీం నువ్వేం చేశావు? నమ్మి నానబోసుకుంటే పులిసి పుచ్చిపోయినట్టు చివరికి దిక్కూ మొక్కూ లేకుండా చావాల్సి వచ్చిందే? భక్తుడి పట్ల దేవుడిగా నీకున్న భాద్యత ఇదేనా?" అని నిష్టూరమాడాడు.

నారయాణ మాటలు విని దేవుడు ఆశ్చర్యపోయాడు."అదేంటి? నువ్వెలా చనిపోయావు? నిన్ను రక్షించడానికి నేను మూడు అవకాశాలు కల్పించాను కదా?" అని అడిగాడు. నారాయణ అమాయకంగా, మూడు అవకాశాలేంటి?" అన్నాడు. దేవుడు జరిగిందంతా తన దివ్య దృష్టితో గ్రహించి నారాయణపై మండిపడ్డాడు. "మార్ఖుడా! నా భక్తుడవనే ప్రేమతో నిన్ను రక్షించడానికి నీకు మూడు అవకాశాలు ఇచ్చాను. ఒకసారి కరణాన్ని పంపించాను. రెండోసారి ఎడ్లబండి పంపించాను. మూడోసారి పడవను పంపించాను. అయినా అవేమీ నువ్వు గ్రహించలేదు. దేవుడంటే కిరీటం పెట్టుకుని, శంఖుచక్రాలు పట్టుకుని గుర్రమెక్కి రాడు. నిన్ను రక్షించే ప్రతి అవకాశం దైవత్వమే అని గ్రహించాలి" అంటూ తలవాచేటట్లు చివాట్లు పెట్టాడు. నారాయణ సిగ్గుతో తలవంచుకున్నాడు..⁠⁠⁠⁠

story

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 ✍✍✍నీతికథ✍✍

ఆ  రాజ్యంలో   రాజుగారు   చాలా  మంచి వాడు . ఆయన  ప్రతి  రోజూ   పేద  బ్రాహ్మణులకు  మద్యాహ్న  భోజనం  వండించి   పెట్టేవాడు.
ఒక  రోజు  యధావిధిగా   భోజనం   వండించే  ఏర్పాట్లు  చేస్తున్నాడు  .  అదే  సమయం  లో   ఆకాశం  లో  ఎగురుతున్న  ఒక  గద్ద  కాళ్ళతో  పట్టుకున్న  పాము  నోటినుండి  విషం  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న   అన్నం  బేసిన్  లో  పడింది  .  అది  ఎవరూ  గమనించలేదు
ఆభాగం  ఒక  బ్రాహ్మణుడు  తిన్నాడు.  అది   తినడం  వలన    అతడు  చనిపోయాడు .  ఈ  వార్త  రాజుగారికి  చేరింది   .   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు .
.
.
ఇప్పుడు  బ్రాహ్మణుడు  చనిపోవడానికి   కారణం  ఎవరు ?

రాజా ?   వంటవాడా ?    పామా ?  గద్దా  ? వడ్డించిన  వ్యక్తా ?
.
ఈ  పాపాన్ని  ఎవరి  ఖాతాలో  వెయ్యాలి ?
.
.
వీరిలో  ఎవరూ   కావాలని  ఆ  బ్రాహ్మణుడిని   చంపలేదు .
.
.
యమ  ధర్మరాజును  అడిగారు  .
.
ఇది  ఇలా  ఉంటె  మర్నాడు    దారినే  పోతున్న  బ్రాహ్మణులు  కొందరు   అన్నదానం  జరిగే  చోటును  చెప్పమని  ఒక  వనితను  అడిగారు .  ఆమె  వారికీ  దారిని  చూపుతూ
“  బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి  బ్రాహ్మణులు  అంటే   పడదు  .  నిన్ననే  ఒకాయనను  విషం  పెట్టి  చంపేశారు”    .  మీ  రోజులు  బాగున్నాయో   లేదో  ?   అంది  .
.
  యమధర్మరాజు  గారు
“ చిత్రగుప్తా !    మొత్తం  పాపం  అంతా  ఈమె   ఖాతాలో  వెయ్యి .
యాదృచ్చికంగా    జరిగే   పనులకు   వ్యక్తులను  నిందించే  వారికి   ఆ  మొత్తం  కర్మ  ఫలం  కలుగుతుంది  అని  ధర్మం .” అన్నారు .
.
MORAL OF THE STORY ;

WHEN WE CRITICIZE OTHERS , WE TAKE UP THEIR KARMA .!!

BEAUTIFUL STORY FROM SRIMAD BHAGAVATA(ఈ నీతి కథ శ్రీమద్ భాగవతం నుండి గ్రహించబడింది)

🙏🙏🙏🙏👏👏👏👏⁠⁠⁠⁠

Saturday, January 14, 2017

బ్రాహ్మణ యువతీ కష్టం

ఒక బ్రాహ్మణ యువతి కష్టం :          ఆమె భర్త  కొండపల్లి లోని ఒక ప్రసిద్ధ  కంపెనీ లో పనిచేసేవారు. ఆమె ఇబ్రహీంపట్నం లోని ఒక ప్రముఖ స్కూల్‌ లో పనిచేసేది. ముగ్గురు సంతానము.
మొదటి అమ్మాయి బి.టెక్‌, మొదటి సంవత్సరము, రెండవ అమ్మాయి సీనియర్‌ ఇంటర్‌,చిన్నవాడు ఏడవ తరగతి.
ఇలాఉండగా, భర్త  తీవ్ర అనారోగ్యం వచ్చింది. ఉద్యోగము నకు వెళ్ళకపోవటము తో జీతం ఆగిపోయింది. భర్తను కనిపెట్టుకొని ఉండవసిరావడంతో ఆమె కూడా ఉద్యోగం మానివేయవసి వచ్చింది.
 ఆదాయం లేకపోవటంతో , ఇంటి స్ధం ఉంటే అమ్మేశారు. ఉపాధి కోసం, ఏదైనా వ్యాపారం చేద్దామని, వారి బంధువు బ్రాహ్మణకార్పొరేషన్‌ ద్వారా చాణక్యపధకము ద్వారా దరఖాస్తు చేసింది. ఆ దరఖాస్తు డి.ఆర్‌.డి.ఏ.ద్వారా ,బ్యాంక్‌ అధికారుకు చేరాలి, ఇంటర్యూ జరగాలి, సెలెక్ట్‌ అయితే లోను ఇస్తారు. ఇవ్వన్నీ, ఎప్పటికవుతాయో తెలియదు.
ఈ సమస్యతో బ్రాహ్మణ సేవాసమాజము వారిని  సహాయము అడుగుతోంది.
భర్త ను చూసుకొంటూ ,ఏదైనా ఉపాధి మార్గము కోసము వెతుకుతున్నది. మీరు ఏమైనా  ఆచరణాత్మకమైన సలహా గాని సహాయము గాని చేయగలరా

NTR AAROGYA RAKHA SCHEME

📝 APTF W G 📝

NTR  ఆరోగ్య రక్ష
ఎన్.టి.ఆర్ ఆరోగ్య రక్ష హెల్త్ ఇన్సురన్స్ పధకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?

💥 -ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం కోసం ప్రవేశపెట్టిన "డా. ఎన్.టి.ఆర్.వైద్య సేవ", "ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం", "పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణా పథకం" తో పాటుగా ఆ మూడు పథకాలలో లబ్దిపొందలేని వారి కోసం ఆరోగ్య రక్షను ప్రవేశపెట్టారు._

💥 ఆరోగ్య రక్ష పథకం ద్వారా సంవత్సరానికి మీ కుటుంబములోని పిల్లల నుండి పెద్దల వరకు ఒకొక్కరికి కేవలం రూ.1200/-మాత్రమే చెల్లించి దరఖాస్తు చేసుకొని హిల్త్ కార్డును పొందవచ్చు. హిల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు. ముందుగా పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోగలరు.


💥 ఎలా దరఖాస్తు చేసుకోవాలి 💥

🖥ఆన్లైన్ విధానం🖥
ముందుగా ఇక్కడ మీ ఆధార నెంబర్ టైపు చేస్తే, మీ ఆధార్ కు అనుసంధానం అయిన ఫోన్ నెంబర్ కు వన్ టైం పాస్వర్డ్ వస్తుంది.


http://pull71.sps.ap.gov.in/NTRVS/NTRpages/NtrHome.aspx

💥తరువాత ఫారం ఫిల్ చేసి, ఆన్లైన్ లోనే ప్రీమియం చెల్లించవచ్చు.


దరఖాస్తు సమయములో ఎటువంటి సందేహాలకైనను టోల్ ఫ్రీ నెం. 104 లేదా 8333817469 నెంబరుకు సంప్రదించి నివృత్తిచేసుకోవచ్చు.
💥01-01-2017 నుండి 28-02-2017 లోపు దరఖాస్తు చేసుకొని ప్రీమియం చెల్లించాలి.
💥ఆరోగ్యరక్ష పథకం ద్వారా 07-04-2017నుండి డా.ఎన్.టి.ఆర్ వైద్యసేవలోఅనుమతి పొంది ఉన్న ఆసుపత్రులలో 1044 వ్యాధులకు సెమీ ప్రైవేట్ వార్డ్ (ఎ.సి) లో వైద్యము అందించబడును
💥హెల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు
💥వైద్యము పొందుతున్న సమయములో ఎటువంటి డబ్బు చెల్లించనవసరం లేకుండా డాక్టరును సంప్రదించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులు, వైద్యముతో పాటు భోజనము మరియు డిశార్డ్ అయ్యేటప్పుడు 11 రోజులపాటు సరిపడా మందులను పొందగలరు.
💥డిశార్డ్ అయిన అనంతరము నిర్ధారించబడిన 138 రకాల వ్యాధులకు సంవత్సరం పాటు ఉచితంగా మందులు ఇవ్వబడును.
💥బీమా గడువు మధ్యలో పుట్టిన పిల్లలను చేర్చాలంటే  పథకంలో చేరే నెల నుండి భీమా గడువు ముగిసే చివరి నెలవరకు నెలకు రూ.100/- ల చొప్పున మొత్తము చెల్లించవలసి ఉంటుంది, ఇందుకు తొలిగా పిల్లల పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది.
💥మీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 410 నెట్వర్క్(ప్రభుత్వ మరియు ప్రైవేట్)ఆసుపత్రులలో వైద్య చికిత్సలు చేయించుకోవచ్చు, ఈ ఆసుపత్రుల్లో పొందిన వైద్యచికిత్సలకు సంబంధించి మెడికల్ టీమ్ ఆడిట్(Accountable) చేస్తుంది, దీని వల్ల మీకు సరిఅయిన వైద్యం అందిందో లేదో నిర్ధారించటంతో పాటు, ఒక వేళ సరైన వైద్య చికిత్సలు అందలేదని ధృవీకరింపబడితే ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవటం జరుగుతుంది

💥ఇతర భీమా పథకాలలో బిపి, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వయసుపైబడిన వారికి ఆకాశాన్నంటేలా ప్రీమియంలు ఎక్కువ చెల్లించాల్సిఉంటుంది. ఈ ఆరోగ్యరక్ష పథకంలో అటువంటి అధిక చెల్లింపులు లేకుండా చెల్లించిన ప్రీమియంకే పెద్దలకు పిల్లలకు ఆరోగ్య భీమా క్రింద ఒకే రకమైన వైద్యం అందించబడుతుంది.
💥ఆరోగ్యరక్ష పథకం మొదటి రెండు నెలలు కడితే చాలు, మూడో నెల నుంచి ఈ పధకం వర్తిస్తుంది. కాని ప్రైవేటు హెల్త్ ఇన్సురన్సులు, 2-3 సంవత్సరాలు ప్రీమియం కడితే కాని, మీరు క్లెయిమ్ చేసుకోవటం కుదరదు.
💥ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి చెల్లించే ప్రీమియం వల్ల లభించే భీమా మొత్తం వేరొకరికి కుటుంబ సభ్యునికి బదిలీ చేయబడదు. అంటే ఒక వ్యక్తికి చెల్లించిన ప్రీమియం మరొక వ్యక్తికి వర్తించదు.

madhu. aptf .unguturu⁠⁠⁠⁠

Ibpam brahmna seva sangham

[1:27 PM, 1/13/2017] +91 72072 53159: ఈ రోజు నుండి బ్రాహ్మణ సమాజం నాకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ 9493683220 ను ఆక్టివ్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ నెంబర్ ప్రస్తుతం నా దగ్గర వున్నది . దీన్ని అవసరాన్ని బట్టి సెక్రటరీ ,గాని వారు అనుమతి తో ఇతర కార్యవర్గ సబ్యుల దగ్గర ఉంటుంది. మీ అవసరాలు ,సూచనలు ,సలహ్హాలు ఈ నెంబర్ కు ఇవ్వగలరు. ఈ నెంబర్ , మీకు అందించిన ప్రతి క్యాలెండరు మీదా ఉన్నది. దయచేసి ,మా పర్సనల్ ఫోన్ లకు చేయవద్దు. ఫోఎన్ చేసెటప్పుడు, మీరు పేరు చెబితే ఆ నెంబర్ నోట్ ఫీడ్ చేసుకుంటాము.                      
[1:43 PM, 1/13/2017] +91 72072 53159: బ్రాహ్మణ సమాజము మీటింగ్ అంటే ఏ గుళ్ళోనో ,బెహార సీతారామయ్యగారి ఇంటిలోనే,టాలెంట్ స్కూల్ లో జరిగేవి . Sri PVL.Prasad and NagaLakshmi,కొండపల్లి ,వారి చొరవతో,ఖిల్లా రోడ్ లోని, primary helth center,దగ్గర గల వారి స్వగృహములో గత 2 నెలలుగా కార్యవర్గ సమవేసములు జరుగుతున్నవి. ఆ రకముగా ,బ్రాహ్మణ సమాజమునకు ఒక shelter దొరికినది. మరొక దాత (పేరు వద్దు అన్నారు) సహృదయం తో 2 ceiling fans, 6అడుగుల బీరువా సమకూరాయి. ఇంకా 25 కుర్చీలు, మరియు ఒక టేబుల్ ,కు ర్చి ,అవసరము. దయ చేసి , దాతలు మీరు వాడినవైనా లేదా మీ ఆత్మీయుల పుట్టిన రోజు కానుగా లేదా వారి జ్ఞాపకార్థం కూడా నైనా ఇస్తే , బ్రాహ్మణ సమాజము మరింత గా సేవలు అందించటానికి సహాయం చేసిన వారు అవుతారు.

happiness video

Blood donars

We are ready to help
 For blood donate pls share to u r friends,collegus,relation etc

1.Srikanth O+ ,9700655144.
2.Mani O+ ,7401535415
3.Sriram B+ ,8056051072
4.Ramesh B+ , 9884727286
5.Suresh B+,  8148916988
6.Murali  A+. 7299399392
7.PRABHU. O+ 9884641396
8.Vijay. AB-ve. 9790954376
9.Jai. B-    99623610622
10.Raja A1+ 9789865312
11.Perumal O+
12.KALIDASS A+ 13.9943948951
14.Abbas A1- 9551414146
15.Rajalingam B+ 9626696882
Sundar O+ 9941418736
16.Yuvaraj AB+ 8124291412
17.jagir B+. ,9042670928
18.suresh Kumar O+. 9840939939
19.aravind O+, 9176980878.
20.Manikandan A+ 9566420317.
21.Senthilkumar B+,9962688252.
22.praveen kumar B +
9094314313
23.mohanraj B positive
      9444464789
24.manikandan O+
       9791097653
25.C.prathap O +ve  9940521093
26.Isaianand o+. 7845548466
27. S THILAK O+ ve , 861810723.  
28. Anbumani O+ (9566001676)
29.Syed A+  9551457239
30.M.jagadeesanvb A➕(7845662500)
31.Karthikeyan o+(9884400371)
32.Daniel
B+ (9003148805)
33.Sridhar o+ (9500119761)
34.V.Mohan 0+ (9940639557)                        35, jawahar b+ve 9600162581
36.v.karthick A1+ (9578828854)
37.C.Rajkumar B+ve
9790844373
38. Ashok Kumar B+
      9791142469
39.M.KARUKKUVEL Raj B positve -9087425095
40.NARENDRAN A1B+(9500148984)
41.edwin. O- 9791150119 42. Selvaganesh A+ (9940187708)
43.siddiq O+. 9094666918
44.a.inba kumar o+ ve  9840301747
45.vignesh B+ 9884556995
46.vogneshgiri B+ 9043677660
47.anbarasan O+ 9840862846
48.M.Vimal kumar o+ 9677279760
49.Jeeva AB- (ph-8056292339)
50.sarath A+ 9551113240
51.vazir o+(8754034986)
52.Dinesh A1+(8122288878)
53. Balakrish  O+ (9047904837)                          54.Madhan AB+(9940391891,9498142021)55. P.P.PRADHEESH O+ve +91-8903612888)
56. SHAKKUR B+ve+971552177084)
57. Venkat B-ve 9666661705
58. Roshan A+ve 9100954327
59.Vinod 9985003839
60. Joshua B-ve 9704972553
61.Arun B+ve 9951997775
 62. Dr.v.rajnikanth O+  9032807745.  
63.Saleem O+ve 9666714234
share this to as many groups as possible it may help⁠⁠⁠⁠

Thursday, January 12, 2017

మడి- ఆచారములు

🌷 మడి 🌷

మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.
అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.
కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.

మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలివేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.

ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం.

ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం.

అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.

మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం

మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు.

కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే

మడి అంటే ఏమిటి ?

మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.

మడి ఎలా కట్టుకోవాలి ?

రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను.

 ( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )

 మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకోనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి)

 శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.

మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను.

పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము.

మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించింనవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు.

మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.

ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవము లోకి వస్తాయి.

నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనంచేస్తున్నాను

Ramakrishna Deekshitulu Archakam గారి సౌజన్యంతో⁠⁠⁠⁠

jamalapuram

మీరు జమలాపురం వెంకటేశ్వర స్వామీ దర్సనానికి వెళ్తున్నారా ? అయితే , మీ కుతుమ్బసబ్యులకు,ఉచిత భోజన సదుపాయము (కేవలం బ్రాహ్మణులకే) కలదు. మీరు, అక్కడ కు చేరెండుకు ఒక రెండు గంటల ముందు గా మీరు ఎంత మంది వస్తున్నారో చెబితే ,వారు ఏర్పాటు చేస్త్తారు. వివరాలకు : 9959426602.  ఈ సమాచారము మనకు అందించినవారు శ్రీ శొంటి సుబ్బారావు,Sr.Assist,Dr.NTTPS.APGENCO.