Monday, March 20, 2017

ఆగిరిపల్లి వేద పాటశాల

వేదం మనందరకీ ప్రామాణికం. వేద మంత్రం పరమ పవిత్రం. వేద మంత్రోచ్చారణ చెవులకి విందుగా వుండి, మనలో ఒకరకమైన పాజిటివ్ శక్తి ని ప్రవేశ పెడుతుంది. వేద పరిరక్షణ మనందరీ బాద్యత. అటువంటి,బాద్యతను మనము మోయటంఎలా? వేదాభ్యాసము చదివేవారిని, ఆ అద్యాపకులను, అలా వేదము నేర్పే విద్యాలయములను మనకున్నంతలో,ఆర్థికముగా మరియు హర్థికముగానూ సాయపడటమే మనము చేయవలసిన పని!.
అయితే ,దాతలు అనేకులు – కానీ ,వారికి కావల్సినది – తాము ఇచ్చేధనము సద్వినియోగం  అవుతుంది అన్న నమ్మకం కలగటమే.  అటువంటి నమ్మకాన్ని ,దాతలు కలిగించాలానే ఉద్దేశ్యము తో ,ది. ది.19.03.2016,ఆదివారము ,ఇబ్రహింపట్నం కు సుమారు 40 కిలోమీటర్స్ దూరం కలిగిన ఆగిరిపల్లి గ్రామము లోని శ్రీ శోభనాద్రి లక్ష్మి నరసింహ వేద శాస్త్ర పాటశాల ను,ఇబ్రహింపట్నం  మండల బ్రాహ్మణ సేవా సమాజము కార్యవర్గ సభ్యులు కొంతమంది సందర్శించటం జరిగింది.
సుమారు 100 సంవత్సరముల క్రితమే ఏర్పాటు చేయబడ్డ ఈ వేద పాటశాల , కాలక్రమీణ, మరుగున పడి, గత మూడు సంవత్సరములుగా తిరిగి తన పూర్వ వైభవము ను పొదేందుకు కృషి చేస్తున్నది.

ఇక్కడ సుమారు 50 మంది విద్యార్థులకు నాలుగు వేదాలే గాక, స్మార్తం కూడా నేర్పుతున్నారు. చూట్టు ప్రహరి, గోశాల, ప్రశాంత వాతావరణం లో, కేవలము 8 సంవత్సరంల వయస్సు కలిగిన పిల్లాలు కూడా చక్కగా వేదమంత్రాలు వల్లెవేయడం ఎంతో బాగుటుంది. దేవాదాయ శాఖ ద్వారా, ద్వారకతిరుమల దేవస్థానము నుండి రు 50,000/ మరియు తిరుమల తిరుపతి దేవస్థానము ద్వారా రు.2,00,000/ మొత్తము రు.2,50,000/ఈ వేద పాటశాల కు చేరుతున్నవి. అయితే , క్రమముగా, ఇతర రాష్టాలనుండి కూడా  విద్యార్థులరావడంతో ,క్రమేపి విద్యార్థుల సంఖ్యా పెరుగుతూ వస్తున్నది. ఈ పరిస్థితి లో ప్రభుత్వము వారు అందించే ,సహాయము సరిపోక ,దాతలను కూడా ఆస్రయించవలసిన  పరిస్థితి తలఎత్తుతోంది.
ఇక్కడి యాజమాన్యాము వారి అంచనా ప్రకారము ప్రతి వేద విద్యార్థికి నెలకు రు.2000/(రెండు వెలు మాత్రమె),విరాళము గా ఇస్తే , పాటశాల , ను సులువుగా నడపవచ్చు అని తెలుపుతోంది.
కాబట్టి ,దయగల వారు , ఈ క్రింది బ్యాంకు ఎకౌంటు లో , మీ శక్తీ మేరకు ధనమును విరాళముగా ఇస్తే బాగుటుంది.
 మరిన్ని వివరాలకు ,వీరి website; www.sslnvedapatasala.com ను గాని, www.facebook.com/sslnvedapatasala. ను గాని సందర్శించ వచ్చు.
విరాళము ఇవ్వ గోరు దాతలు ఈ క్రింది బ్యాంకు ఎకౌంటు లో తమ విరాళము ను జమ చేయవచ్చు.
Sri Sobanadri Lakshmi Nrusimha Veda Sastra Patasala
A/c Number:34015791742,IFSC Code:SBIN0013305,Agiripalli.
మరిన్ని వివరాలకు శ్రీ S.V.S.L.N.Sarma,Secretary,Cell No: 9951059394, 9100540949 సంప్రదించవచ్చు.
మీకు మరింత అవగాహన కొరకు అక్కడి విద్యార్ధులు వేదములను అబ్యాసిస్తున్న సమయములో తీసిని కొన్ని వీడియోలు, అక్కడ చదువుతున్న ఒక విద్యార్ధి తల్లి తండ్రులు చెప్పిన అభిప్రాయములు, అక్కడి విద్యార్దుల పరిచయం మీకు తెలుపుతున్నాను.


                   విరాళములు మరియు ఇంకా ఇతర విషయము లు తెలుసికొని ,ఈ పాటశాల అభివృధికి తమ వంతు సాయం అందించే వారు ఈ క్రింది నెంబర్లు ను సంప్రదించగలరు.Sri B.L.P.Sastry,Cell:9441144111, Premakumar, Cell: 7207253159.

Tuesday, March 7, 2017

రాజు నారాయణస్వామి.

రాజు నారాయణస్వామి.
ఒక ఫెయిల్యూర్ స్టోరీ.
 .
1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు.స్టేట్ ఫస్ట్....
 .
1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ....స్టేట్ ఫస్ట్....
 .
ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....
 .
1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తి చేశాడు.బ్యాచ్ ఫస్ట్.....
 .
అదే ఏడాది గేట్ పరీక్ష ....మళ్లీ ఫస్ట్ రాంక్....
 .
ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు...మళ్లీ ఫస్ట్ ర్యాంక్....
 .
ఐఏఎస్ శిక్షణలో మరోసారి ఫస్ట్....
 .
ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని ఆమెరికా ఎర్ర తీవాచీ పరిచి, పచ్చ కార్డు వీసా ఇచ్చి, పచ్చజెండా ఊపి మరీ మా మెసాచుసెట్స్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరమని సీటు ఇచ్చింది.
 .
మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే.మనవాడు మాత్రం నా చదువుకు ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది.
 .
ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు. ప్రజల డబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం... వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులేతనను చదివించాయి.
అలాంటిది ఆ పేదల స్వేదాన్ని, జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్లడం ఏమిటి అనుకున్నాడు. ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష వ్రాసి ఐఏఎస్ అయ్యాడు.
 .
చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న విలువలు, పేదల పట్ల ప్రేమ, ఏదో చేయాలన్న తపన... వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు.
 .
అతని పేరు రాజు నారాయణ స్వామి. కేరళలోని పాల్ఘాట్ కి చెందిన వాడు.అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి.
 .
ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు, స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది. ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది.
 .
ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే అడ్డుకున్నాడు రాజు నారాయణస్వామి. మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది.
ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ భవనం కట్టుకున్నాడు. "నా అల్లుడు కలెక్టర్... నన్నేం చేయలేరు" అనుకున్నాడు.
 .
మన కలెక్టర్ గారు ఆ భవనాన్ని కూల్చేయించారు. కోపంతో మామభగ్గుమన్నాడు. భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణస్వామిని వదిలివెళ్లిపోయింది.
 .
ఆ తరువాత రాజు నారాయణస్వామి పన్నులు ఎగవేసిన ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు. ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు.
కలెక్టర్ గారుఅవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు.
 .
అంతే ...
మళ్లీ ట్రాన్స్ ఫర్... మళ్లీ కొత్త ఊరు... కొత్త పని...కొత్త చోట వానాకాలాని ముందు మట్టితో చెరువులకు, నదులకు గట్లు వేయడం... బిల్లులు వసూలు చేసుకోవడం.... ఆ తరువాత వానలు పడటం... వానకి గట్టు కొట్టుకుపోవడం.... మళ్లీ టెండర్లు... మళ్లీ పనులు... మళ్లీ బిల్లులు... మళ్లీ వానలు...ఇదే తంతు కొనసాగేది.
రాజు నారాయణ స్వామి దీన్ని అడ్డుకున్నారు. వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు ఇచ్చేది అన్నాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు.
 .
మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు. అంతే ... మళ్లీ పాత కథ పునరావృతం అయింది.చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి అచ్యుతానందన్ రాజు నారాయణస్వామిని ఎలాంటి ప్రాధాన్యతా లేని ఒక విభాగంలో పారేశారు.
 .
చివరికి ఆయన నిజాయితీని, పని పట్ల ఆయన శ్రద్ధను చూసి ఐక్యరాజ్యసమితి నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. మా దగ్గర పనిచేయండి అని కోరుతూ పిలువు వచ్చింది.
 .
ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక ఎక్కడో ప్యారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవడానికిసిద్ధమయ్యాడు.
రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు. ఆయన 23 పుస్తకాలు వ్రాశారు.
 .
వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. ఆయన వ్రాసిన నవలకు సాహిత్య ఎకాడెమీ అవార్డు కూడా వచ్చింది. ఆయన వ్రాసిన నవల్లో హీరో అన్యాయంపై విజయం సాధించి ఉండొచ్చు.
 .
కానీ నిజజీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.
రాజు నారాయణ స్వామి ... ఈ ఘనతవహించిన భారతదేశంలో ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోయాడు.⁠⁠⁠⁠

వివాహమైన మొదటి రోజు భార్య

వివాహమైన మొదటి రోజు భార్య,  భర్త ఒక ఒప్పందానికి వచ్చారు.. అదేమిటంటే ఇంటికి visitors ఎవరు వచ్చినా తలుపు తీయకూడదని.... కానీ అదే రోజు అతని తల్లిదండ్రులు వచ్చారు .. ఒప్పందం ప్రకారం తలుపు తీయలేదు .. బాధపడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు ..... కొద్దిసేపయ్యాక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు ... కనులలో నీళ్ళు తిరుగుతుండగా ఆమె అతనితో తలుపు తీయకుండా ఉండలేను.. ఏమీ అనుకోవద్దు అని తలుపు తీసింది.. అతను మాట్లాడకుండా మిన్నకుండా ఉండిపోయాడు ...... కొద్ది సంవత్సరాలు గడచిపోయాయి ..వాళ్ళకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. తరువాత 3వ సంతానంగా అమ్మాయి పుట్టింది... అతని ఆనందానికి అవధులు లేవు .. భారీ స్ధాయిలో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. ఆరోజు రాత్రి భార్య అడిగింది..అబ్బాయిలు పుట్టినప్పుడు ఎలాంటి పార్టీ ఇవ్వలేదు. ఈరోజేంటీ , ఇంత grand గా పార్టీ ఇచ్చారు. అతను చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పాడు .. భవిష్యత్ లో నా కోసం తలుపు తీసే ఏకైక వ్యక్తి నా కూతురే!  Daughters are so Special .. కూతుళ్ళు మన చేయి పట్టుకుని కొద్దికాలమే ఉంటారు... కానీ మన హృదయాన్ని అంటిపెట్టుకుని జీవితాంతం ఉంటారు .. Daughters are Angels sent by God. అమ్మాయిలు మన గుండె చప్పుడు ...

jambu dweepe

ఒంటి బ్రాహ్మణుని ఎదురు దుశ్శకునం కాదు.
ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు. ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బాపనాడి ఎదురేంటిరాబాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. నేను అక్కడే ఉండడం తటస్థించింది. నేను మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేను. తరువాత ఆపెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదుకదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు.  అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి నేను ఆయనకు ఏం చెప్పేనంటే...

చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.

ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారులను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్షసేకరించేవారు.  అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్లక్ష్యంచేసి బిక్షవెయ్యకుండా ఇంటినుండి బయటకు వెళ్లడం మంచిపనికాదు.

ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వారు ఏదో సమావేశానికో, చర్చలకో వెల్తున్నారని అర్ధం.  

ఈరోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. గురుకులాలు అంతకన్నాలేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంతమాత్రమూ కాదు.

ఒక బిచ్చగాడు ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడవనీయండి వీలయితే అతనికి డబ్బులు వేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగానెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన జ్ఞానమెంత.

ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికి అది ఆసమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనువుగా పెట్టుకున్నవయి ఉంటాయి. అది ఈరోజులలో వర్తించదు." అని ముగించాను నా సమాధానం.
ఒక్క నిట్టూర్పుతో ఆయన నన్ను అభినందించేడు.

దురదృష్టం ఏమిటంటే ఒక బ్రాహ్మణుడే బ్రాహ్మణుని శకునం మంచిది కాదనే అజ్ఞానంతో ఉండడం. ఎందుకండీ అంటే వారికి తోచిన రీతిలో వారి చర్యను సమర్ధించుకోవడం మరింత అజ్ఞానం.

ఇటువంటి అప-ఊహలను (అపోహలను) సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.
ధన్యవాదములు అందరికీ.⁠⁠⁠⁠

onti brahmin

ఒంటి బ్రాహ్మణుని ఎదురు దుశ్శకునం కాదు.
ఆమధ్య ఒక పెద్దమనిషి ఇంటిలోంచి బయటకు వెల్తున్నాడు. ఒక బ్రాహ్మణ కులస్థుడు ఎదురు పడ్డాడు. "బాపనాడి ఎదురేంటిరాబాబూ ఇయ్యేల" అంటూ మళ్లీ వెనక్కి ఇంటిలోకి వెళ్లిపోయాడు. నేను అక్కడే ఉండడం తటస్థించింది. నేను మామూలుగా ఆ ఎదురు శంక లేకుండా హాయిగా బయటకు వెళ్లేను. తరువాత ఆపెద్దమనిషి అదేంటండీ బ్రాహ్మణుని ఎదురు మంచి శకునం కాదుకదా. మీరేమిటి గమనించలేదా అని అడిగాడు.  అప్పుడు ఆయనను స్థిమితంగా కూర్చోబెట్టి నేను ఆయనకు ఏం చెప్పేనంటే...

చాలామందికి ఈ అపోహ ఉంది. ఇదే విషయాన్ని నేను లోగడ ఒక వైష్ణవ పండితుని అడిగేను. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు సముచితంగా తోచింది.

ఒంటి బ్రాహ్మణుడు కాదు. ఒంటి బ్రహ్మచారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. పూర్వం గురుకులాలలో ప్రతీ రోజు గురువుగారు తనవద్ద విద్యనభ్యసిస్తున్న బ్రహ్మచారులను బిక్షాటనకు పంపేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కొక్క వీధిలోని గృహాల నుండి బిక్షసేకరించేవారు.  అటువంటి బ్రహ్మచారి ఎదురయితే ఆయనను సాదరంగా ఆహ్వానించి బిక్షవేసి సాగనంపాలి. అటువంటి ఒంటి బ్రహ్మచారి ఎదురయి నప్పుడు ఆయనను నిర్లక్ష్యంచేసి బిక్షవెయ్యకుండా ఇంటినుండి బయటకు వెళ్లడం మంచిపనికాదు.

ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపైన ఎంతమంది ఎదురయినా వారు ఏదో సమావేశానికో, చర్చలకో వెల్తున్నారని అర్ధం.  

ఈరోజులలో బిక్షాటన చేసే బ్రహ్మచారులూ లేరు. గురుకులాలు అంతకన్నాలేవు. అందుచే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎంతమంది ఎదురయినా అది మంచి శకునమే గాని దుశ్శకునం ఎంతమాత్రమూ కాదు.

ఒక బిచ్చగాడు ఎదురయితే అతను బ్రాహ్మణుడవనీయండి, బ్రాహ్మణేతరుడవనీయండి వీలయితే అతనికి డబ్బులు వేసి కదలండి. మీరనుకున్న కార్యం దిగ్విజయంగానెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మన జ్ఞానమెంత.

ఒకవేళ ఏదైనా కారణం ఉన్నప్పటికి అది ఆసమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనువుగా పెట్టుకున్నవయి ఉంటాయి. అది ఈరోజులలో వర్తించదు." అని ముగించాను నా సమాధానం.
ఒక్క నిట్టూర్పుతో ఆయన నన్ను అభినందించేడు.

దురదృష్టం ఏమిటంటే ఒక బ్రాహ్మణుడే బ్రాహ్మణుని శకునం మంచిది కాదనే అజ్ఞానంతో ఉండడం. ఎందుకండీ అంటే వారికి తోచిన రీతిలో వారి చర్యను సమర్ధించుకోవడం మరింత అజ్ఞానం.

ఇటువంటి అప-ఊహలను (అపోహలను) సమాజంలో దూరం చెయ్యడం ప్రతి ఒక్కరి విధి.
ధన్యవాదములు అందరికీ.⁠⁠⁠⁠

joint family

ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది
అమ్మ, నాన్న,....
అక్క బావ...
చెల్లి మర్ది....
అన్న వదిన....
తమ్ముడు మర్దలు....
మేనత్త మేనమామ....
పిన్ని బాబాయ్.....
పెద్దమ్మ పెదనాన్న....
తాతయ్య అమ్మమ్మ....
తాతయ్య నానమ్మ.....
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా....
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం....
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం.....
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం.....
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్యా, అమ్మ సస్తే తప్ప....
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹
💑👨‍👨‍👧👨‍👩‍👦‍👦👨‍👨‍👧‍👦👨‍👨‍👦‍👦👩‍👩‍👦🌏

Forward to all
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

doctor

ఒక ముఖ్యవిషయం
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో HEALTH KART PLUS  ఆప్ డౌన్లోడ్ చెయ్యండి,
దాన్లో మీకు కావలసిన మందు పేరు ఎంటర్ చెయ్యండి,
మందు వివరాలు కంపెనీ,
ధర మొదలైన వివరాలన్ని తెలుస్తాయి,
అంతేకాదు అందులో ఉన్న   SUBSTITUTE ఆప్షన్ క్లిక్ చెయ్యండి అదె మందును తక్కువ ధరలో అందిచే ఇతర కంపెనీల వివరాలు తెలుస్తాయి...
Ex: ఫైజర్ కంపెనీకి చెందిన Lyeica 75mg అనే మందు 14 టబ్లెట్స్ షీట్ 768.56  అంటే ఒక టాబ్లెట్ ఖరీదు 54.89 కానీ అదె మందు Cipla (prebex) కంపెనీ  10 tablets sheet 59.00 అంటే ఒక టాబ్లెట్ ధర 5.90 ధరలోనె అందిస్తుంది.
సొ మందుల కంపెనీల మాయాజాలం , దోపిడిని తెలిసు కోవడానికి
అందరికి ఉపయోగపడే సమాచారం తప్పక షేర్ చెయ్యండి...

డాక్టర్లు వ్రాసే కోడ్స్ అర్ధాలు చూడండి... (Common Abbreviations)
> Rx = Treatment.
> Hx = History
> Dx = Diagnosis
> q = Every
> qd = Every day
> qod = Every other day
> qh = Every Hour
> S    = without
> SS  = On e half
> C     = With
> SOS = If needed
> AC    = Before Meals
> PC   = After meals
> BID = Twice a Day
> TID = Thrice a Day
> QID = Four times a day
> OD  = Once a Day
> BT   = Bed Time
> hs    = Bed Time
> BBF = Before Breakfast
> BD   = Before Dinner
> Tw   = Twice a week
> SQ   = sub cutaneous
> IM    = Intramuscular . .
> ID     = Intradermal
> IV      = Intravenous
> QAM = (every morning)
> QPM =(every night)
> Q4H  = (every 4 hours)
> QOD = (every other day)
> HS    = (at bedtime)
> PRN  = (as needed)
> PO or "per os" (by mouth)
> AC    = (before meals)
> PC    = (after meals)
> Mg   = (milligrams)
> Mcg/ug = (micrograms)
> G or Gm = (grams)
> 1TSF ( Teaspoon) = 5 ml
> 1 Tablespoonful =15ml

Kindly Share this Useful Information With
Everyone.⁠⁠⁠⁠

children care

దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి...............హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి..........ప్లీజ్..........

1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి....అవి ఎలా పనిచేస్తున్నాయో........
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో..........వాటివలన లాభాలేంటో చెప్పండి.

2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.
వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి........

3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి.........తప్పక వారికి
ఈతను నేర్పండి..........

4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి....చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి.........

5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి.......నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి...

6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి.........రోగులు పడే పాట్లను......
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.......

7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.........అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి.......వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృద్ధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి......

8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది........

9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ......వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి......వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి............

10.అన్ని మతాల దేవాలయాలకు తీసుకుని వెళ్ళండి........మీకు తెలిసిన
విషయాలను వారికి చెప్పండి.........అన్ని మతాలు ప్రేమించమనే
చెప్పాయని,ద్వేషించమని ఏ మతమూ చెప్పలేదని వారికి తెలియచేయండి........

వీటిలో మీరు కొన్ని అయినా చేస్తే..........
మీ పిల్లలకు మంచిని చేసినవారు
అవుతారు.......
ప్లీజ్..
చేస్తారని ఆశిస్తూ.........⁠⁠⁠⁠