వివాహమైన మొదటి రోజు భార్య, భర్త ఒక ఒప్పందానికి వచ్చారు.. అదేమిటంటే ఇంటికి visitors ఎవరు వచ్చినా తలుపు తీయకూడదని.... కానీ అదే రోజు అతని తల్లిదండ్రులు వచ్చారు .. ఒప్పందం ప్రకారం తలుపు తీయలేదు .. బాధపడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు ..... కొద్దిసేపయ్యాక అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు ... కనులలో నీళ్ళు తిరుగుతుండగా ఆమె అతనితో తలుపు తీయకుండా ఉండలేను.. ఏమీ అనుకోవద్దు అని తలుపు తీసింది.. అతను మాట్లాడకుండా మిన్నకుండా ఉండిపోయాడు ...... కొద్ది సంవత్సరాలు గడచిపోయాయి ..వాళ్ళకు ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. తరువాత 3వ సంతానంగా అమ్మాయి పుట్టింది... అతని ఆనందానికి అవధులు లేవు .. భారీ స్ధాయిలో అందరినీ పిలిచి పార్టీ ఇచ్చాడు. ఆరోజు రాత్రి భార్య అడిగింది..అబ్బాయిలు పుట్టినప్పుడు ఎలాంటి పార్టీ ఇవ్వలేదు. ఈరోజేంటీ , ఇంత grand గా పార్టీ ఇచ్చారు. అతను చిరునవ్వు నవ్వుతూ ఇలా చెప్పాడు .. భవిష్యత్ లో నా కోసం తలుపు తీసే ఏకైక వ్యక్తి నా కూతురే! Daughters are so Special .. కూతుళ్ళు మన చేయి పట్టుకుని కొద్దికాలమే ఉంటారు... కానీ మన హృదయాన్ని అంటిపెట్టుకుని జీవితాంతం ఉంటారు .. Daughters are Angels sent by God. అమ్మాయిలు మన గుండె చప్పుడు ...
No comments:
Post a Comment