ది. 11.11.2015 న బుధవారము, నేను , నా పిల్లల్లు, తిరుమల శ్రీవారిని దర్సించుకున్నాము. ది. 10.11.2015, రాత్రి 9.40 కు గుంటూరు- తిరుపతి (ట్రైన్ నెంబర్ )లో తిరుపతి తెల్లవారుఝాము 5.౦౦ గంటలకు చేరాము. మాతో పాటు మరొక ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చారు. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరనుంచి ఆటో లో అలిపిరి చేరాము. మనషికి రూ. 20.00చొప్పున 6గురుం రూ. 120.00 చెల్లించాము . లగేజి కౌంటర్ లో లగేజి ఇచ్చి, నడక మొదలెట్టాము. ఉదయం 6.15 కు మొదలైన నడక మద్న్యానం12.30 కు పూర్తి అయ్యింది .
దీపావళి రోజున తమిళ నాడు రాష్ట్రము నుండి ఎక్కువ మంది భక్తులు రావటం గమనించాను. మెట్ల దారి (నడక దారి) లో మెట్టు,మెట్టు కు కర్పూరం బిల్లు వెలిగిస్తూ కొందరు, పసుపు,కుంకుమ బొట్లు పెడుతూ కొందరు ,కొత్తస్తీల్ బిందెలో పసుపు నీళ్ళు పోసుకొని మెట్టులెక్కుతున్నవారు ఒకరు,అన్నింటికంటే - పూర్తిగా కాళ్ళు చచ్చుబడిపోయిన ఒకరు, నడక మార్గము లో రావటం - వీళ్ళందరిని చూస్తుంటే స్వామి వారి దర్సించు కోవటం లో ఒక్కరి ఒక్కరిది ఒకొక్క పద్ధతి అనిపించింది .
స్వామి ని దర్శించు కోవాలంటే , స్వామి అనుమతి ఉండాలేమో ! మాతో పాటు వచ్చిన 19 ఏళ్ల అమ్మాయకి, ఊహించనట్లుగా ఆడవారి ఇబ్బంది రావటం ! ఇది ఇలా ఉంటే- మరొకరి గురుంచి విన్నాను... అదేమంటే, వాళ్ళ అమ్మాయకి జాబు వచ్చిoదని నడక మార్గము ద్వారా వస్తున్నారు, కొద్ది మెట్లు ఎక్కే సరికి ఆ అమ్మాయకి విపెరీతముగా వాంతులట ! ఇంక మెట్లు ఎక్కలేక పోయారుట !
సరే, మెట్లు ఎక్కుతూ , ఉచిత దర్సనం టోకెన్లు ఇఛు ప్రదేశం కు చేరాము. అక్కడ దారిలో ఉచిత దర్సనం టోకెన్ లు ఇచ్చేప్రదేశం లో పాలు మరియు కట్టేపొంగాలి ని T.T.D వారు నడక దారి భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. అవి సేవించి, టోకెన్లు తీసికొని తిరిగి మా ప్రయాణం (నడక) మొదలెట్టాము. మద్యాహన్నం
12.30 కు లగేజి సెంటర్ కు చేరి , మా సామానులు తీసుకున్నాము. అక్కడ లంచం అడిగారు.
అక్కడనుండి రూమ్ తీసికోవటానికి వెళ్ళాము. జోరున వాన. వానలో తడుస్తూ C.R.O(Central Reservation Office) చేరాము. అక్కడ వాళ్ళు మేరు రిపోర్ట్ చేయవలసిన టైం అయిపొయింది పక్క కౌంటర్ కెళ్ళి కరెక్ట్ చేయంచండి అన్నారు, ఆ పనిచేసి రూమ్ అల్లోట్ చేయించు కొని , మాకు కేటాయించిన పాంచజన్యం గెస్ట్ హౌస్ కు వానలో తడుస్తూ ,కళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ చేరాము.
https://plus.google.com/+PremakumarKalikivaya/posts/AoohQ23GMEbTirumal 1Tirumal 3

అక్కడ మా రూమ్ చూద్దుముకదా, అపరిశుబ్రముగా ఉన్నది . మల్లీ వెళ్లి రిసెప్షన్ లో చెబితే అప్పడు క్లీనింగ్ స్టాఫ్ వచ్చి క్లీన్ చేసి
వెళ్ళారు. మల్లీ ఇక్కడ లంచం అడిగారు.
ఆ గెస్ట్ హౌస్ లో కళ్యాణ కట్ట లేదుట , ఎదురుగుండా ఉన్న 5 అంతస్తుల మేడలో ఉన్నది , మేము ఉన్న కాటేజీ 3అంతస్తుల నుండి లిఫ్ట్ లో దిగి తలనీలాలు సమర్మించే కార్యక్రమము కానిచాము , అక్కడ మంగలి వారు ముగ్గురు కు రూ . 50 / ఇవ్వండి , లేక పొతే మీ డబ్బులు తీసుకొండని ,నేను ఇచ్చిన రూ. 25.00 తిరిగి ఇచ్చేసారు. ఇక్కడ లంచమే !
కాటేజీ కొచ్చి స్నానాలు చేసి , బయట టిఫిన్ చేసి స్వామి
దర్శనము కు బయలు దేరాము, గుడికి ఎటు వెళ్ళలో తెలియదు, జీప్ ల వాళ్ళ మాట విని 1
గంటలో దర్సనం అవుతుదని చెప్పి మాదగ్గర మనిషికి 20/ చొప్పున తెసికొని సర్వదర్సనం
వెళ్ళే దారి దగ్గర దింపాడు.
అక్కడ నిండి
నిజంగానే 1 గంటలో దర్సనయం అయ్యింది.
అన్తఃరం హుండీ లో మాకనుకలు వేసి లడ్డు అలోకోసం బయలు దేరాము.
నడక మార్గం లో మాకిచిన టోకెన్ చూపి టోకెన్ కి ఓకే లడ్డు చొప్పున పొందాము. బయలు దేరే
ముందు సెల్ ఫోన్ లు ఒక కుంటర్ లో ఇచ్చి టోకెన్ తెసికోవాలి , అవి బయట వేరే కౌంటర్ దగ్గర తెసికోవాలి .
ఇవ్వన్ని అయిన తరువాత S.V.B.C channel వాళ్ళు నిర్వహించు కార్యక్రమములు అక్కడే వున్న వేదిక ను చూసాము.
తరవాత మా కాటేజీ దగ్గర లో ఇందాక కల్యాణకట్ట దగ్గర T.T.D వారి
ఉచిత అన్నదాన సత్రములో స్వామి అన్నప్రసాదము స్వీకరించి, రూమ్ ఖాళి చేసి (ఇక్కడ
కౌంటర్ లో లంచం), మా దగ్గర కాషన్ డిపాజిట్ గా కట్టించు కున్న Rs,500/ లు తిరిగి తీసుకుని కొండ క్రిందకు వచ్చి అక్కడనుండి ట్రైన్ లో తిరిగి విజయవాడ, అక్కడనుండి ఆటో లో
కొండపల్లి ఉదయం 5.30 కు చేరాము.
ఇలా ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న తిరుమల ప్రయాణం స్వామీ వారి దయతో సుఖం గ జరిగింది

No comments:
Post a Comment