Tuesday, October 27, 2015

A TELUGU STORY

సరిత - రామనాథం ,రాజ్యలక్ష్మి లకు ఒక్కగానొక్క కూతురు . చిన్నప్పటి నుంచి  చదువుల్లో ఫస్ట్ రాంక్  లో వుండేది . మధ్య తరగతి కుటుంబం కావటం వల్ల ,ఆడపిల్లను బాగా చదివించి  తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయాలనీ , తన స్తోమత కు ఎక్కువైనా ,సరిత ను చార్టెడ్ అకౌంటెంట్ చేసాడు రామనాథం గారు .సరిత  కు  చదువు అయ్యినవెంటనే , ఉద్యోగము  వచ్చింది .
     ఒక రోజు ,  తల్లి బాగా దగ్గుతూ వుంటే , ఏమిటమ్మా , ఏమి అయ్యింది అని తల్లి దగ్గరు వెళ్లి అడిగింది. తను చుస్తూ  ఉండగానే, మళ్ళీ  దగ్గుతూ తల్లి నోటినుండి రక్తం పడడం గమనించి , వెంటనే హాస్పిటల్ కు తీసికెళ్ళింది. టెస్ట్లు   అన్ని చేసాక, రేపు వస్తే విషయం చెబుతామన్నారు, మర్నాడు, రామనాథం గారు, సరిత వెళ్లి విష యం  కనుకున్ని, రామనాథం గారు కూలబడి పోయారు ,  ,రాజ్యలక్ష్మి గారి కి కాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజి .ఇంక రోజులే మిగిలాయి ! కొన్ని రోజులు మృత్యువు తో     పోరాడుతూ  రాజ్యలక్ష్మి గారు కన్నుమూసారు .
 ఉద్యోగము లో చేరి కొద్ది రోజులే అవటం తో సెలవలు పెద్దగ దొరకలేదు సరితకు, దాంతో తల్లి పోయిన,  4 వ రోజే డ్యూటీ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది .
కార్యక్రమాలన్నీ అయిన తర్వాత, ఒక రోజు సడన్ గా తన బావమరిది సూర్యనారాయణ  వచ్చాడు.  కుశల ప్రశ్నలు  అయ్యాక, తనువచ్చిన పని  చెప్పడం మొదలెట్టాడు సూర్యనారాయణ    " బావా ! అక్క పోయి  ఎంతో కాలం కాలేదు! మరి నేను ఇలా మాటలాడ వచ్చో , లేదో తెలియదు . అంటూ నసుగుతున్నాడు.  రామనాథం గారు ఫరవా లేదు, చెప్పు అనటం  తో విషయం చెప్పాడు  ." ఏమి లేదు బావా ! మా అబ్బాయి సతీష్ కు సంబంధాలు చూస్తున్నాము, బయటసంబంధాల కంటే అయిన వాళ్ళలో చూద్దామని, మీ అమ్మాయి సరిత ను మా ఇంటి కోడలుగా చెసుకుందామని . అడగటానికి వచ్చాను . అన్నాడు . దీనిలో కాదనటా నికి ఏమి లేదు - సతీష్ ,సరిత్ కు అన్ని  విధాల  జోడినే , కానీ,   ఎందుకో    రాజ్యలక్ష్మి బతికున్నప్పుడు ఈ ప్రస్తావన్ వచ్చినప్పుడు  వద్దు అంది, ప్రస్తుతం , తనకు ఎవరు లేరు, పిల్ల ఎవరింటింకొ  కంటే అయిన వాళ్ళఇంటి కేలెతే  మంచిదే  కదా అనిపిస్తోది,  రామనాథం గారికి . చివరకి,  సతీష్ కిచ్చి చేయటానకి .ఒప్పుకుంటూనే  ప్రాధేయ పడుతూ  అడిగారు బావమరిదిని  "మరి నేను చేసుకోలేని  రోజు న, నా  కూతురింటికే  రావాలి వస్తుంది  , న చివరి రోజులు   అమ్మాయి దగ్గరే పోవాలి, అందుకు మీ కిస్తామేనా" అని ." ఛ ,ఛ అదేమి  మాటలు బావా ! నీ కూతురింటికి  కాక మరి ఎక్కడి కెలతావు " , అంటూ భోరోస ఇచ్చాడు  సుర్యనారాయణ. 

పెళ్ళి అయింది . కొద్దిరో జులు విడిగానే ఉన్నా  చేసుకోలేక కూతురి ఇంటికి    చేరారు  రామనాథం  గారు .
 రెండు సంవసతరాలు  గడిచేటప్పటికి తను ఇద్దరు పిల్లల కి తాత కూడా అయ్యరు. కూతురు కు భారం  కాకుండా తన కొచ్చే పెన్శ్శన్లొ  లో ఆరు వేలు ఇసున్నారు, మనవల్ల్తో చక్కగా కా లక్హేపం  జరుగుతున్నది . సుర్యనారాయణ కి ఇవేమీ నచ్చలేదు, కూతురు పెట్టే   తిండి బాగానే  వంట పట్టింది అనటం , మనవళ్ళకు అనారోగ్యం  చేస్తే అవి వాళ్ళకు తను తెచ్చే  తినుబండారలవల్లె అని సూటి పోటి మాటలనటం   జరుగుతోంది . ఇది నెమ్మదిగ అల్లుడు కుతురు  మధ్య  తగాదా ల దాక  వెళ్ళింది దాంతో ,బాగా కలత చెందిన   రామనాథంగారు, నెమ్మదిగా తన మకాం
 వృ ధా శ్రామానికి  మార్చారు . తన ఆదాయం కోసం, ఒక ఏటిమయం  దగ్గర  గార్డు గా చెరారు. 
 మన అను  కుని పిల్ల నిస్తే పరిస్తితి ఎలా తయారయిందో అని నిట్టూ ర్చటం  తప్ప ఏమి చేయలేని నిస్సాయ స్థితి  రామనాథం  గారిది  

No comments: