Saturday, July 30, 2016

వికలాంగులకు వీల్ చైర్ SMS కు స్పందన

వికలాంగులకు వీల్ చైర్ : ఈ పేరిట ఇచ్చిన SMS కు స్పందించిన మన గ్రూప్ సభ్యుడు సాయి - దాని అవసరము ఉన్న వారి పేరు ఈ గ్రూప్ లో పెట్టటం ,నేనే వారికి ఫోన్ చేసి విషయమము చెప్పి , దాత పేరు అడ్రస్ చెప్పితే, నిన్న సాయత్రం (30.07.2016) న వెళ్లి ఆ  వీల్ చైర్ ను ఉచితముగా పొందటం జరిగింది. దాత శ్రీ మద్దిపట్ల సూరిబాబు గారు, సహృదయంతో, మనకు అవసరం లేని వస్తువు ,మరేవరకైనా ఉపయోగపడుతుంది అన్న  సదుద్దేశంతో , ఈ సాయం అందించారు. దాత లు ఈ సేవ సంస్థ కు సమాచారంఅందించిన వెంటనే , గ్రూప్ లో ఆ సమాచారం పెట్టటం , కావలసిన వారు ఆ సాయం ను అందుకోవటం జరుగుతున్నది. అయతే , గ్రహీత లు తమకు ఈ సేవ సంస్థ ద్వారా అందించినసాయం కు కనీసం కృతజ్ఞతగా తమ భావమును తెలపటం  ఎంతైనా అవసరమని భావిస్తున్నాను ! ఇది సేవ చేసేవారికి కొంచెం encouragement  గా వుంటుంది . ఈ సాయం అందించటం లో వ్యాకరణం చక్రపాణి గారు తమ వంతు సాయం అందించారు. సబ్యులు కూడా ,దాత లకు  encouragement  గా కామెంట్స్ పెడితే బాగుంటుదని నా అభిప్రాయం .

No comments: