Sunday, July 2, 2017

మన విద్యా వ్యవస్థ-తీరు తెన్నులు

  మన విద్యా వ్యవస్థ-తీరు తెన్నులు
  • బాల్యం లో –తెలుగులో బోధన
  • బట్టీయం
  • వృత్తివిద్యాకోర్సుల సక్రమంగా నిర్వహించక పోవటం
  • detenstion విధానం లేకపోవటం.
  • ప్రభుత్వ పాటశాలలో సౌకర్యముల లేమి
  • అధ్యాపకులలో రాజేకయాలు- ఆధిపత్య పోరు
  • విద్యార్థులపై తలితండ్రుల గారాబం
  • పిల్లల పై మీడియా ప్రభావం
  • నిర్బంధ వ్యాయామవిద్య లేకపోవటం కావటంతో
  • నాణ్యత లేని వృత్తి విద్యాకోర్సులు
  • పోరుగుదేశాలకు వలస.
బాల్యం లో తెలుగులో విద్యాబోధన వల్ల పిల్లలు పాట్యంసాలను చక్కగా అర్థం చేసుకోగలరు. ఇంట్లో మాట్లడే భాష ,స్కూల్ లో బోధించే భాష- ఒకేటే కావటమే దీనికి కారణం. అలా, కాకుండా తను మాట్లాడే భాష ఒకటి ,  భోధన భాష వేరేగా ఉంటే, ప్రతి పదాన్ని ,తనకు తెలిసిన భాష లో తెలుసుకొని ,ఆపై భోధనా భాషా కు అలవాటు పడాలి. దీని వల్ల ,విద్యార్ధి పై చాలా చిన్న వయస్సులోనే ,చదువు గురుంచి ఒత్తిడి మొదలవుతుంది.
కేవలమ్ బట్టీయం వేయించటం వల్ల –ఉపయోగం వుండదు. పాట్యంసము లోని భావాన్ని అర్థం చేసుకోవటం వల్ల మాత్రమే వారికి విజ్ఞానము వస్తుంది. కాని, మరి మన విద్యాబోధన లో ఆ అవకాసం ఎంతవరకు ఉన్నది?  అలాగే, చదువు చెప్పే ఉపాధ్యాయులకు ఉన్న విద్యా ప్రమాణాలు ఏమరకు ఉన్నాయి అనేది ఆలోచించ వలసిన విషయం!
చదువుతూనే ఉపాధి పొందాలి, అన్న ఉద్దేశ్యం తో ఏర్పాటు చేసిన వృత్తి విద్యాకోర్సులు ,సరైన instuctor లేక ,తగు పరికరాలు లేక ఈ లక్యం ఎలా నీరు గారి పోతోందో చూస్తూనే వున్నాము!
  నిర్బంధ ఉత్తీర్ణత అనేది –మనము ఆసలు ఒప్పుకోము. కేవలం హాజరు వుంటే చాలు పై తరగతి కి పంపే విధానం కే మన ఓట్. కాదని మనలో ఎంత మంది గలరు.? ఇదివరకు S.S.L.C లో ఉత్తీర్ణత సాధిస్తే ఎంతో చక్కని విద్యాప్రమాణాలు కలిగిఉండే వారు, మరి ఇప్పుడో?
మన చూపు ఎంత సేపు ప్రైవేటు స్కూల్స్ వైపే , ప్రభుత్వ స్కూల్స్ వైపు చూడం. కారణం – సరియైన బోధన ప్రమాణాలు ఉంటాయో, లేదో ,సరైన టీచర్స్ ఉంటారో, లేరో అన్న భయం. కాని విద్యా కమిటీ ల ద్వార మనము మాట్లాడుకొని ,సమస్యలు పరిష్కరించుకోవాలి అని అనుకోము!
             దురదృష్టం ఏమంటే- చదువు చెప్పే మాస్టర్ల పై రాజకీయ నాయకుల ప్రభావం ఉంటోంది. ఇది వరకు ,ఏ రాజకీయాలైనా స్కూల్స్  కి  చేరేవి కావు. టీచర్స్ బదిలీలు ,పోస్టింగ్స్ ప్రతిదీ రాజకీయం అయిపొయింది .ఆ ప్రభావముతో టీచర్స్ లో కూడాగ్రూప్స్ కట్టడం జరుగుతోంది. ఇది ,తిరిగి విద్యార్థుల పై  ఆ ప్రభావం పడుతోంది.
ఇదివరకు మాస్టారు- విద్యార్ధి పై క్రమ శిక్షణలో భాగంగా ఒక దెబ్బ వేస్తె –కుర్రాడు ఏదో తప్పు చేసి ఉంటాడు అని భావించే వారు  తల్లి దండ్రులు . మరి ఇప్పుడో .......   ఇందుకు , ఇప్పుడు కేవలం ఒకరు లేక ఇద్దరు సంతానమే వుండటం కూడా కారణం... దాంతో వచ్చిన గారం.
పిల్లలపై మీడియా ప్రభావం ఎంతో .. ఉంటోంది. అందుబాట్లో.. స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ అందుబాటులోఉండటం తో , మంచి కి చెడుకి తేడా తెలియం లేదు.  చెప్పే పెద్దవాళ్ళు లేరు.  దీనికి తోడు తల్లిదండులు ఇద్దరు ఉద్యోగస్తులు కావటం తో ,పిల్లపై శ్రద్ద కూడా తగ్గుతోంది.
ఎన్ని ప్రభుత్వాలు మారినా ,వ్యాయామవిద్య ను నిర్బంధం చేయటం  లేదు . ఫలితముగా , పిల్లలు శారీరకముగా వ్యాయామమ్ లేకుండా ,కేవలం వీడియో గేమ్స్ కే పరిమితం అయి పోతున్నారు.
చదువుతూనే ,సంపాదన అనేది లక్యం గా వున్న వృత్తి విద్యా కోర్సులు- ఆచారణ లో అంతంత మాత్రమే గానే ఉన్నాయి . సరైన పరికరములు ,అధ్యాపకులు లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.
 ఇన్ని కష్టనష్టాలతో ,విద్యాభ్యాసం చేసిన విద్యార్థి - తన ఉద్యోగ జీవితమును ఇలాంటి వాతావరణం లో గడపటానికి ఇష్టపడక , తన మేధస్సుతో విదేశాలకు ఎగిరి పోతున్నారు.

ఇప్పటికైనా ,ప్రభుత్వాలు,తల్లి తండ్రులు,కలిసి పై సమస్యలకు పరిష్కారము కనుక్కోంటే మంచిది .

No comments: