ప్రభుత్వ
రంగ సంస్థ లో ఉద్యోగాల తీరు
మనం చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రావటం అదృష్టం. చదివిన చదువొకటి
,చేస్తున్న వుద్యోగం ఒకటైతే బాధాకరం. చేస్తున్న మాత్రమే జీతం మాత్రమే వచ్చి,పని
తీరు కు ప్రశంస లేక పొతే నిరాశగా ఉంటుంది. ప్రశంస అనేది మాటలల్లోనో, నగదు రూపేనో,
బహుమతి రూపముగానూ కావచ్చు. అది ఆమె /అతని పనితీరు మరింత మెరుగు పరుస్తుంది. ప్రశంస
లందుకొనే ఉద్యోగం అంటే ఏ మేనేజర్/ ఇంజనీర్ లాంటివే కానక్కరలేదు. అటెండర్,తోటమాలిలాంటి
క్రింది స్థాయిలో కూడా వార్కి కూడా ఎంతో అవసరం.
మరొక రకం ఉద్యోగాలు వుంటాయి – జీతం ఇస్తారు, అన్ని అలవెన్స్
లు ఇస్తారు కాని పని చేయక పోనే ఊరుకుంటారు. ఇలాంటివి ప్రభుత్వ రంగ సంస్థల లో బాగా
కనిపిస్తుంది. ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుందో చూడండి.
మనం పని చేసే సంస్థ లో మన పై అధికారి, మన కంటే తక్కువ
తెలివితేటలు,నిర్ణయసామా ర్థం లేకపోవటం ,ఉద్యోగానియమాలు సరిగా తెలియక పోవటం, వంటి
లక్షణాలు కలిగివుంటే, క్రింది స్టయి వారి పై తరచూ ఆధార పడటం వంటివి ,ఆ అధికారి
క్రింద పనిచేసేవార్కి బాగానే ఉంటుంది. ఇలాంటివి, ఎక్కువగా దొడ్డి దారి లో అంటే
కారుణ్య నియమాకాలలో, కాంటాక్ట్ లేబౌర్ గా చేసి పర్నినేంట్ అయైనవారిలోనో చూడవచ్చు.
అందరూ ఇలాగే ఉంటారని కాదు గాని, ఎక్కువమంది ఇలాగే ఉంటారని , నా అబిప్రాయం.
మరొక రకం వ్యక్తులుంటారు- వీర్కి వారి ఉద్యోగ బాద్యత
గురుంచి తెలిసినా ,తెలియక పోయినా అహః భావం మాత్రం బాగా ఉంటుంది. దీనికి వీరి
సామాజిక వర్గం కూడా,కొంత కారణం అవుతుంది.
ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులలో నిర్ణీత సమయములో
అప్పజెప్పిన పనిని పూర్తి చేయటం.నిర్దేశించిన లక్యాలను చేరుకోవటం ,దానికి కృషి
చేయటం ,అవినీతి ని పక్కనబెట్టం అనేది లేదు. పనిఆధారముగా, పదోన్నతలు ఇవ్వాలి
.అలాకాకుండా ,కేవలం సేనియరిటి ప్రాతిపదికాన ఇచ్చినత కాలం ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది.
No comments:
Post a Comment