[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి- ప్రత్యక్షానుభూతి(1):భక్తిని గురించి మాట్లాడదాం. కొద్ది కాలం కింద బృందావనంలో ఒక గొప్ప సాధకురాలు వుండేదిట. ఇప్పటికి ఆ తపస్విని ఇంటిని సాధకులు పుణ్యక్షేత్రంలా దర్శిస్తూ వుంటారు. ఆమె రాధాకృష్ణులని చిన్నపిల్లలుగా, నిజమైన బిడ్డలుగా భావిస్తూ పూజిస్తుండేది. వాళ్ళకి పాలుపెరుగులు పెట్టడం, స్నానం చేయించడం ఇలా ఎన్నో! ఇవన్నీ ఏదో విగ్రహాలకు చేయిస్తున్నట్టు కాక నిజంగా రాధా కృష్ణులు వున్నట్టు, వారికి అన్నం ముద్దలు పెడుతున్నట్టు ప్రవర్తిస్తుండేది. మొదట్లో ఇదంతా భ్రమ, మతిభ్రమ అని భావించారు చుట్టు పక్కల వాళ్ళు. చిత్రమేమిటంటే కొంత కాలానికి ఆమె రాధకి, కృష్ణుడికి అని పెట్టే లడ్డూలు, వెన్నముద్దలు అందరి ఎదురుగానే మాయమవడం మొదలు పెట్టాయి. దాంతో అందరికి అర్ధమైంది, నిజంగానే ఆమె చిన్న పిల్లలుగా రాధా కృష్ణులని అక్కడ దర్శిస్తోందని. అతి సూక్ష్మంగా ఆ నారాయణున్ని చిన్న పిల్లవానిగా చూస్తూ, పరాత్పర దివ్యస్వరూపమైన రాధాదేవిని బాలికగా దర్శిస్తూ నిజంగానే వారి సాన్నిధ్యంలో ధన్యురాలవుతుండేదిట. అయితే ఈ కధ ఇక్కడితో అయిపోలేదు. ఓ చిన్న సంఘటన జరిగింది - ఆమె భక్తికి పరీక్షో, భగవత్ తత్వాన్ని అర్ధం చేసుకోవాలనుకునే వారికి జవాబో! అనుకోకుండా పిల్లి వచ్చింది. చిన్నవాడైన కృష్ణుడు "అమ్మా! పిల్లి వచ్చిందే భయం! " అంటూ వచ్చాడు. ఏదో ధ్యాసలో వున్న ఆమె అందిట, "నువ్వు విశ్వరూపుడవి, నారాయణుడవి నీకు భయమేంటిరా! " అని. అంతే కృష్ణుడు, రాధా ఇద్దరూ మాయమై పోయారు. ఎంత వెతికినా కనిపించలేదు, ఎంత పిలిచినా రాలేదు.
[8:53 PM, 8/5/2017] Mahendra Vada: భక్తి తత్వం- ప్రత్యక్షానుభూతి(2): అలా ఆమె చింతిస్తుండగా కొంతకాలానికి చైతన్య మహా ప్రభువుల దర్శనమైందిట. ఆయన చెప్పారు, "అమ్మా! భగవంతుడిని నువ్వు చిన్ని వాడుగా భావించి, ప్రేమించి భక్తితో ఆహ్వానించావు. అలా చేసినన్నాళ్ళూ రాధాకృష్ణులు కూడా చిన్ని వారుగా హాయిగా దర్శనమిచ్చారు. ఎప్పుడైతే వారిని విశ్వరూపులుగా, పరాత్పర శక్తిగా దర్శించాలన్న తలంపు కలిగిందో, నీ లక్ష్యంతో పాటు భగవత్ స్వరూపంకూడా అంతుపట్టనంత పెద్దదిగా మారింది. సాధనలో, భక్తి మార్గంలో ఎంత సాధారణమైన, అనన్యమైన భక్తి వుంటే అంత త్వరగా సాక్షాత్కారం లభ్యమవుతుంది" . ఈ మాటలు విని ఆమె తన సాధనతో మళ్ళీ శ్రీ కృష్ణ సాక్షాత్కారాన్ని పొందిందిట. ఇదే ప్రహ్లాదుడి భక్తిలోనూ, కన్నప్ప భక్తిలోనూ కూడా వున్న రహస్యం అనిపిస్తుంది.
అతీతమైన పరబ్రహ్మ తత్వాన్ని ఎలా భావిస్తే అలా దర్శనమవుతుంది. నారద భక్తి సూత్రములు ప్రేమ దర్శనమును గురించి చెప్పాయి. ప్రార్ధనకు పైమెట్టు మంత్ర సాధన, మంత్ర సాధనకు పై మెట్టు ధ్యానము, ధ్యానమునకు పైమెట్టు భావ నిర్మితమైన తాదాత్మ్యం అని ప్రేమోపాసకుల నమ్మకము. నారద భక్తి సూత్రాలు ఇలా మొదలవుతున్నాయి. సా త్వస్మిన్ పరమప్రేమరూపా అమృత స్వరూపా చ యల్లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి అంటే భక్తి అనేది భగవానుని యందు పరమ ప్రేమ స్వరూపమైనది, అది అమృతమయమైనది, ఇది పొందిన మానవుడు సిద్ధపురుషుడగును, అమరుడగును, తృప్తుడగును అని అర్ధము.

No comments:
Post a Comment